లేడి సూపర్‌స్టార్ నయనతార(Nayanthara) నటించిన మొదటి హిందీ సినిమా జవాన్(Jawan) అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆల్ టైమ్ హిట్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే వెయ్యి కోట్లకుపైగా వసూలు చేసి దూసుకుపోతున్నది. ఈ విజయంలో నయనతార భాగస్వామ్యం కూడా ఉంది. అన్ని భాషల అభిమానులను తన నటనతో మెప్పించగలనని రుజువు చేసుకున్నారు నయనతార.

Nayanthara 2nd Bollywood Movie
లేడి సూపర్‌స్టార్ నయనతార(Nayanthara) నటించిన మొదటి హిందీ సినిమా జవాన్(Jawan) అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆల్ టైమ్ హిట్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే వెయ్యి కోట్లకుపైగా వసూలు చేసి దూసుకుపోతున్నది. ఈ విజయంలో నయనతార భాగస్వామ్యం కూడా ఉంది. అన్ని భాషల అభిమానులను తన నటనతో మెప్పించగలనని రుజువు చేసుకున్నారు నయనతార. ఇప్పుడు మరో హిందీ సినిమాను కూడా ఆమె ఒప్పుకున్నారట! గత కొంతకాలంగా సంజయ్ లీలా భన్సాలీ(Sanjay Leela Bhansali) అలనాటి క్లాసిక్ సినిమా బైజూ బావ్రాను(Baiju Bawra) మరోసారి వెండితెర కావ్యంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు. ఆ సినిమాలో నయనతార ఓ ప్రధాన పాత్రలో నటించబోతున్నారని సమాచారం. ఓ హిందుస్తానీ సంగీత విద్వాంసుడి జీవితం చుట్టూ తిరిగే ఆ సినిమాలో నయనతార కూడా భాగం అవుతుందన్న వార్త సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోందని, వచ్చే ఏడాదిలో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని అంటున్నారు. 1952లో వచ్చిన బైజూ బావ్రా సినిమా ఘనవిజయం సాధించింది. ఆ సినిమాలో కథనాయకుడి పాత్రను భరత్‌భూషణ్ పోషించారు. మీనా కుమారి హీరోయిన్‌గా నటించారు. నౌషాద్ సంగీతం అజరామరంగా నిలిచిపోయింది.
