తమిళ హీరో ధనుష్‌పై(Dhanush) నయనతార(Nayanthara) రెచ్చిపోయింది.
తమిళ హీరో ధనుష్‌పై(Dhanush) నయనతార(Nayanthara) రెచ్చిపోయింది. మూడు సెకన్ల క్లిప్ వాడితే రూ.10 కోట్ల చెల్లించమంటావా.. అసలు నువ్వు మనిషివేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా నయనతార రిలీజ్ చేసిన ఓ బహిరంగ లేఖ(Public letter).. వీళ్ల మధ్య ఏం జరిగిందనేది బయటపెట్టింది. నయనతారపై నెట్ ఫ్లిక్స్(Netflix) ఓ డాక్యుమెంటరీ(Documentary film) తీసింది. ఎల్లుండి అది స్ట్రీమింగ్కు వస్తుంది. దీనికి సంబంధించి ట్రయిలర్ వదిలారు. ఇందులో “నేనూ రౌడీనే”(Nenu rowdy ne) అనే సినిమాకు సంబంధించి కొన్ని క్లిప్స్ వాడారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ సినిమా నిర్మాత ధనుష్.. లీగల్ నోటీసు(Legal notice) ఇచ్చాడు. ఆ క్లిప్ వాడినందుకు రూ.10 కోట్లు చెల్లించాలని నోటీసులో పేర్కొన్నాడు. దీంతో ఆగ్రహించిన నయనతార ఓ బహిరంగ లేఖ రాసింది.
పాత వాటిని దృష్టిలో పెట్టుకొని కక్ష సాధించే పని పెట్టుకున్నాడని నయన విమర్శించింది. ఆ 3 సెకెన్ల సన్నివేశాలను వాడినందుకు మాపై 10 కోట్ల రూపాయలకు లీగల్ నోటీసు పంపించావు. నువ్వు ఎంత దిగజారిపోయావో, నీ వ్యక్తిత్వం ఏంటో దీన్ని బట్టి అర్థం అవుతోంది. నువ్వు స్టేజీల ముందు, జనాలకు నీతులు చెప్తావు.. కానీ అవన్నీ పాటించడం చేతకాదు అంటూ దుమ్మెత్తిపోసింది. తమ నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీకి నీ నుంచి ఎన్ఓసీ కావాలి. దాని కోసం రెండేళ్లు ఎదురుచూశాం. చివరికి ఆశలు వదిలేసుకున్నాం మా డాక్యుమెంటరీని రీ-ఎడిట్ చేశాం. ఎన్నో వినతుల తర్వాత అతికొద్ది స్టిల్స్ మాత్రమే వాడుకున్నాం. మీ ఆర్థిక ప్రయోజనాలు, వ్యాపార అవసరాలు ఉంటే అర్థం చేసుకునేవాళ్లం. కానీ కేవలం నన్ను ఇబ్బందిపెట్టాలనే ఉద్దేశం, వ్యక్తిగత ద్వేషంతో మాత్రమే ఇన్నేళ్లు తిప్పించుకున్నారని ఆరోపించింది. అయితే లీగల్ నోటీసు అందుకుంటున్నానని, లీగల్ గానే ఫైట్ చేస్తానని ప్రకటించింది. కాపీరైట్ చట్టం ప్రకారం కోర్టులో ధనుష్‌కు వాదించడానికి ఎక్కువ అవకాశం ఉన్నప్పటికీ, నైతికంగా మాత్రం దేవుడి కోర్టు ముందు ధనుష్ సమాధానం చెప్పాల్సి ఉంటుందని నయన ఆవేదన వ్యక్తం చేసింది. ‘నేనూ రౌడీనే’ సినిమా విడుదలకు ముందు ధనుష్ మానసికంగా తనని గాయపరిచాడని.. ఆ గాయాలను ఇంకా మరిచిపోలేదని ఆరోపించింది నయనతార. ఆ గాయాలు ఎప్పటికీ మానవని, సినిమా విడుదలై పెద్ద హిట్టయిన తర్వాత ధనుష్ ఇగో ఎంత హర్ట్ అయిందో మీడియా ద్వారా తెలుసుకున్నానని రాసుకొచ్చింది.