మందారపువ్వుతో(Hibscus) చేసిన టీ(Tea) ని సేవించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నయనతార(Nayanthara) ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) ఓ హెల్త్‌ టిప్‌ పెట్టింది.

మందారపువ్వుతో(Hibscus) చేసిన టీ(Tea) ని సేవించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నయనతార(Nayanthara) ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) ఓ హెల్త్‌ టిప్‌ పెట్టింది. 'హైబిస్కస్ ఫ్లవర్ (మందారపువ్వు) టీ. ఇది నాకు అత్యంత ఇష్టమైనది అత్యంత ఉత్తేజకరమైనది. ఇది ఆయుర్వేదంలో చాలా కాలంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులకు ఇది సహాయపడుతుంది. చాలా చల్లదనాన్ని కలిగిస్తుంది కాబట్టి మొటిమలు, చర్మంపై వేడి దిమ్మలు మొదలైనవి తొలగిపోతాయి. హైబిస్కస్ టీ వర్షాకాలంలో విటమిన్లు సమృద్ధిగా ఉండటంతో పాటు మన రోగనిరోధక శక్తిని సమతుల్యంగా ఉంచుతుంది. ఇది సీజనల్ ఇన్ఫెక్షన్, అనారోగ్యం నుండి రక్షించే యాంటీ బాక్టీరియల్ ప్రభావాలను కలిగి ఉంటుంది. కాబట్టి ఈ టీ తాగి ఆరోగ్యంగా, సంతోషంగా ఉండండి' అంటూ నయనతార రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. డాక్టర్లు(doctors) విమర్శలు చేశారు. దాంతో ఆ పోస్ట్‌ను నయనతార తొలగించారు. లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మరో పోస్ట్ పెట్టారు. ఓ ఆసక్తికరమైన సందేశాన్ని ఇచ్చారు. 'తెలివి తక్కువ వారితో వాదించవద్దు. ఆ విధంగా మిమ్మల్ని వారి స్థాయికి తీసుకువెళ్లి, ఓడిస్తారు' అంటూ అమెరికాకు చెందిన సుప్రసిద్ధ రచయిత మార్క్ ట్వైన్ సూక్తిని షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. తనని విమర్శించిన వారిని ఉద్దేశించే ఈ సందేశం పెట్టారని చాలా మంది అనుకుంటున్నారు. కొన్ని రోజుల కిందట సమంత(Samantha) కూడా హెల్త్‌ పాడ్‌కాస్ట్‌లో హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ నెబలైజర్‌ వాడటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెప్పి డాక్టర్లతో తిట్లు తిన్నారు. నయనతార కూడా సమంతలాగే విమర్శలు ఎదుర్కొన్నారు.

Eha Tv

Eha Tv

Next Story