లేడి సూపర్‌స్టార్ నయనతార(Nayanthara) లేటెస్ట్‌గా అన్నపూరణి(Annapoorani) అనే సినిమాలో నటించాడు. ది గాడెస్ ఆఫ్ ఫుడ్ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఆ సినిమా నయనతార కెరీర్‌లో 75వ సినిమా! లాస్టియర్ డిసెంబర్ 1వ తేదీన విడుదలౌన ఆ సినిమా థియేటర్లలో సరిగ్గా ఆడలేదు. ఆ వెంటనే నెట్‌ఫ్లిక్స్‌లో కూడా స్ట్రీమింగ్ అయ్యింది. ఈ సినిమాలో రాముడిని కించపరిచే విధంగా ఉందంటూ శివసేన(Shivasena) మాజీ నాయకుడు రమేశ్ సోలంకి(Ramesh solanki) ముంబాయి పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కొన్ని దృశ్యాలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, లవ్ జిహాద్‌ను ప్రోత్సహించేలా ఉందని ఆయన కంప్లయింట్‌లో పేర్కొన్నారు.
లేడి సూపర్‌స్టార్ నయనతార(Nayanthara) లేటెస్ట్‌గా అన్నపూరణి(Annapoorani) అనే సినిమాలో నటించాడు. ది గాడెస్ ఆఫ్ ఫుడ్ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఆ సినిమా నయనతార కెరీర్‌లో 75వ సినిమా! లాస్టియర్ డిసెంబర్ 1వ తేదీన విడుదలౌన ఆ సినిమా థియేటర్లలో సరిగ్గా ఆడలేదు. ఆ వెంటనే నెట్‌ఫ్లిక్స్‌లో కూడా స్ట్రీమింగ్ అయ్యింది. ఈ సినిమాలో రాముడిని కించపరిచే విధంగా ఉందంటూ శివసేన(Shivasena) మాజీ నాయకుడు రమేశ్ సోలంకి(Ramesh solanki) ముంబాయి పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కొన్ని దృశ్యాలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, లవ్ జిహాద్‌ను ప్రోత్సహించేలా ఉందని ఆయన కంప్లయింట్‌లో పేర్కొన్నారు. దీంతో నయనతారపై కూడా కేసు నమోదయ్యింది. ఎందుకొచ్చిన గొడవ అనుకుని నెట్‌ఫ్లిక్స్(Netflix) కూడా ఆ సినిమాను తొలగించింది. లేటెస్ట్‌గా ఈ వివాదంపై నయనతార స్పందించారు. క్షమాపణలు(appology) చెబుతూ సోషల్ మీడియాలో ఓ లేఖ పోస్ట్ చేశారు. జై శ్రీరామ్ అంటూ ఓ ప్రకటన విడుదల చేస్తూ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పారు. 'గత కొద్ది రోజులుగా నేను నటించిన అన్నపూరణి సినిమా చర్చనీయాంశంగా మారింది. అందుకే బరువెక్కిన హృదయంతో, స్వయం సంకల్పంతో ఈ ప్రకటన చేస్తున్నాను. అన్నపూరణి సినిమాను కేవలం కమర్షియల్ ప్రయోజనాల కోసమే కాకుండా ప్రజల్లోకి ఓ మంచి ఆలోచనను తీసుకెళ్లే ప్రయత్నంగా మాత్రమే మేము చూశాం. దృఢ సంకల్పంతో పోరాడితే ఏదైనా సాధించవచ్చు అనేది చెప్పడానికి అన్నపూరాణి సినిమాను తెరకెక్కించాం. అన్నపూర్ణి ద్వారా సానుకూల సందేశాన్ని అందించాలని మేమంతా భావించాము. కానీ తెలియకుండానే కొందరి మనసులను గాయపరిచామని తర్వాత అర్థమయ్యింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ పొంది , ఆ తర్వాత థియేటర్‌లో విడుదలైన ఒక సినిమాను OTT నుంచి తొలగించారు. ఇది మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సినిమా ద్వారా ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం నాకుగానీ, నా టీమ్‌కు గానీ లేదు. నేను భగవంతునిపై ఎంతో నమ్మకంతో అన్ని ప్రార్థనా స్థలాలను సందర్శించే వ్యక్తిని కానీ ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ ఇలాంటి పని చేయలేదు. చేయను కూడా. అంతకు మించి మీ మనోభావాలను ఏ విధంగానైనా గాయపరిచి ఉంటే నన్ను క్షమించండి. అన్నపూర్ణి చిత్రం అసలు ఉద్దేశ్యం ఎవరినీ కించపరచడం కాదు, ప్రేరేపించడం మాత్రమే. నా ఇరవై ఏళ్ల సినీ జర్నీ లక్ష్యం ఒక్కటే. సానుకూల ఆలోచనలను వ్యాప్తి చేయడం ఆపై ఇతరుల నుంచి మంచి విషయాలు నేర్చుకోవడం మాత్రమే అని నేను ఇక్కడ మరోసారి సూచించాలనుకుంటున్నాను' అంటూ నయనతార సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నారు.