✕
Nayanthara : లగ్జరీ లైఫ్ అంటే నయనతారదే, స్టార్ హీరోలను మించి ఆస్తులు కూడగట్టిన స్టార్ బ్యూటీ..?
By EhatvPublished on 14 Aug 2023 2:20 AM GMT
కొంత మంది తారలు మాత్రం 40 ఏళ్లు వచ్చినా అదే క్రేజ్ తో ఇండస్ట్రీలో కొనసాగుతుంటారు. ఫిట్ నెస్ కాని.. గ్లామర్ కాని ఏమాత్రం తగ్గకుండా స్టార్ స్టేటస్ తో పాటు.. భారీ రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటుంటారు. సాధారణంగా బాలీవుడ్ లో ఇలాంటి తారలు కనిపనిస్తారు. లైక్ దీపికా, ప్రియాంక లాంటివారు. కాని ఈమధ్య సౌత్ లో కూడా ఇలాంటి హీరోయిన్లు తయారవుతున్నారు. వారిలో నయనతార కూడా ఉన్నారు.

x
Nayanthara
-
- సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి విజయ శాంతి తరువాత లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది నయనతార. వరుస సినిమాలు.. భారీ రెమ్యనరేషన్ తో .. ఇండస్ట్రీలో స్టార్ డమ్ తో పాటు.. చేతి నిండ సంపాదిస్తోంది బ్యూటీ. ప్రస్తుతం ఆమె ఆస్తుల గురించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
- నయనతార తమిళ లేడీ సూపర్ స్టార్. సైత్ లో బాగా డిమాండ్ ఉన్న నటి. సాధారణంగా హీయిన్లకు 30 ఏళ్లు దాటితే.. కెరీర్ కంప్లీట్ అవుతుంది. మహా అయితే.. 35 కి హీరోయిన్ గా కెరీర్ అయిపోతుంది. ఇక ఎంత ప్రయత్నించినా.. వారికి అవకాశాలు రావనే చెప్పాలి. ఇటు క్యారెక్టర్ రోల్స్ కూడా చేయలేరు. దాంతో ఓ ఏడెనిమిదేళ్ళు.. లేకపోతే ఓ పదేళ్లు గ్యాప్ ఇచ్చి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా రీ ఎంట్రీలు ఇస్తుంటారు.
-
- కాని అదేంటో.. కొంత మంది తారలు మాత్రం 40 ఏళ్లు వచ్చినా అదే క్రేజ్ తో ఇండస్ట్రీలో కొనసాగుతుంటారు. ఫిట్ నెస్ కాని.. గ్లామర్ కాని ఏమాత్రం తగ్గకుండా స్టార్ స్టేటస్ తో పాటు.. భారీ రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటుంటారు. సాధారణంగా బాలీవుడ్ లో ఇలాంటి తారలు కనిపనిస్తారు. లైక్ దీపికా, ప్రియాంక లాంటివారు. కాని ఈమధ్య సౌత్ లో కూడా ఇలాంటి హీరోయిన్లు తయారవుతున్నారు. వారిలో నయనతార కూడా ఉన్నారు.
-
- సమంత కూడా ప్రస్తతం నయనతారనే ఫాలో అవుతుంది. 40కి దగ్గరగా వయస్సు వస్తున్నా.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఫిట్ నెస్ తో పాటు గ్లామర్ కూడా కాపాడుకుంటూ.. దూసుకుపోతోంది. సమంత. ఈమధ్యే విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమా కూడా చేసింది. ఇక నయనతార విషయానికి వస్తే.. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లు .. యంగ్ స్టార్స్ తో హిట్ సినిమాలు చేస్తున్న హీరోయిన్ కంటే కూడా డబల్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందట నయన్.
-
- నయనతార డిమాండ్ ఆరేంజ్ లో ఉందిమరి. ఇక ప్రస్తుతం పెళ్లి పిల్లల తరువాత కూడా ఏమాత్రం తగ్గడ లేదు నయన్. చేతినిండా సంపాదిస్తోంది. పైగా జవాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తోంది. షారుఖ్ సరసన మెరవబోతోంది. ఈక్రమంలో నయనతార సంపాదన, ఆస్తుల గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆమె స్టార్ హీరోలను మించి ఆస్తులు కూడగట్టినట్టు తెలుస్తోంది.
-
- కర్తవ్యం,డోరా వంటి లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించిన నయనతార.. ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ కెరీర్ ను కొనసాగిస్తోంది. ఇక నయన్ తన సినిమాకి దాదాపు 5 నుండి 6 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందట. అయితే బాలీవుడ్ మూవీ జవాన్ కోసం ఏకంగా 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి.
-
- ఇదంతా ఒక ఎత్తయితే... నయనతార స్టార్ హీరోలకు మించి ఆస్తిపాస్తులు సంపాదించినట్టు ప్రచారం జరుగుతోంది. ఆమె దాదాపు 180 కోట్ల వరకు ఆస్తి సంపాదించినట్టు సమాచారం. ముంబై,కేరళ, హైదరాబాద్, చెన్నై వంటి సిటీలలో ఖరీదైన బంగ్లాలతో పాటు.. నయన్ గ్యారేజీ లో అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయట. .మెర్సిడెజ్, బిఎండబ్ల్యూ, టయోటా ఇన్నోవా క్రిస్టా వంటివి మాత్రమే కాకుండా.. ప్రైవేట్ జెట్ విమానం కూడా ఈ హీరోయిన్ కి ఉంది.
-
- ఒక హీరోయిన్ .. అది కూడా ఏమాత్రం బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. ఎదిగిన తార.. సొంత విమానం మెయింటేన్ చేయడం అంటే.. ఎంత సంపాదన ఉందో అంటున్నారు నెటిజన్లు అంతే కాదు.. సినిమాలతో పాటు.. నయనతారకు సోంతంగా కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి. వాటితో పాటు కొన్ని బ్రాండ్స్ కు ఆమె అంబాసిడర్ గా చేస్తున్నారు. అంతే కాదు.. కొన్ని వ్యాపారాల్లో శేర్ హోల్డర్ గా కూడా నయన్ ఉన్నట్టు తెలుస్తోంది.
-
- ఇలా హీరోయిన్ గా మాత్రమే కాకుండా రకరకరాల మార్గాల నుంచి కోట్లల్లో సంపాదిస్తోందట నయనతార. ప్రస్తుంతం ఆమె ఆస్తులకు సంబంధించిన వార్త వైరల్ అవుతుంది. కాని ఇందులో ఎంత వరకూ నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Ehatv
Next Story