చూస్తుండగానే ఇయర్‌ ఎండింగ్‌కు వచ్చేశాం! రోజులు ఎంత వేగంగా గడిచిపోతున్నాయో కదూ! వారం రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ వారాంతంలో, ఈ సంవత్సరాంతంలో మనల్ని వినోదపర్చడం కోసం ఓటీటీలో(OTT) కొత్త సినిమాలు(Cinema) వస్తున్నాయి. ఆల్‌రెడీ థియెటర్లో సలార్‌(Salaar) సందడి చేస్తున్నది.

చూస్తుండగానే ఇయర్‌ ఎండింగ్‌కు వచ్చేశాం! రోజులు ఎంత వేగంగా గడిచిపోతున్నాయో కదూ! వారం రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ వారాంతంలో, ఈ సంవత్సరాంతంలో మనల్ని వినోదపర్చడం కోసం ఓటీటీలో(OTT) కొత్త సినిమాలు(Cinema) వస్తున్నాయి. ఆల్‌రెడీ థియెటర్లో సలార్‌(Salaar) సందడి చేస్తున్నది. మొదటి షో నుంచే హిట్‌టాక్‌ను సొంతం చేసుకున్న సలార్‌ కలెక్షన్లను కుమ్మేస్తోంది. ఈ వారం థియేటర్లలో పెద్దగా పెద్ద సినిమాలు లేవు. నందమూరి కల్యాణ్‌రామ్‌ నటించిన డెవిల్‌(Devil), సుమ(Suma) కొడుకు హీరోగా పరిచయం అవుతున్న బబుల్‌గమ్‌లు(Babulgum) కాస్త చెప్పుకోదగ్గ సినిమాలు. అదే సమయంలో ఓటీటీలో మత్రం మంచి సినిమాలు వస్తున్నాయి.
లేడి సూపర్‌స్టార్‌, అగ్ర కథానాయిక నయనతార తన కెరీర్‌లో బెంచ్‌మార్క్‌ చిత్రంగా అన్నపూరణి వచ్చింది. ఇది ఆమెకు 75వ సినిమా! డిసెంబర్‌ 1వ తేదీన థియేటర్లలోకి విడుదలయ్యింది. అన్నపూరణి.. ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌ అనే ట్యాగ్‌లైన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో జై, సత్యరాజ్‌, కె.ఎస్‌.రవికుమార్‌ కీలకపాత్రలలో నటించారు. నికిలేష్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా కేవలం తమిళంలోనే విడుదయ్యింది. ఇప్పుడు ఓటీటీలో మాత్రం తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌ కాబోతున్నది. డిసెంబర్‌ 29వ తేదీ నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కాబోతున్నట్టు అధికారికంగా ప్రకటన వచ్చింది. 2023 ఎండింగ్‌లో చాలా మందిని మెప్పించిన ఈ సినిమా ఇంట్లోనే చూడొచ్చు. అన్నపూరణితో పాటు ఈ వారం ఓటీటీల్లో చాలా సినిమాలు వస్తున్నాయి. తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన మంగళవారం, 12th ఫెయిల్ చెప్పుకోదగ్గ సినిమాలు. వీటితో పాటు పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు-వెబ్ సిరీసులు ఉన్నాయి.

ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్(Netflix)

రికీ గెర్వైస్: అర్మగెడ్డోన్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో) - డిసెంబరు 25
స్నాగ్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 25
కో గయే హమ్ కహా (హిందీ సినిమా) - డిసెంబరు 26
థాంక్యూ ఐ యామ్ సారీ (స్వీడిష్ మూవీ) - డిసెంబరు 26
ఏ వెరీ గుడ్ గర్ల్ (తగలాగ్ చిత్రం) - డిసెంబరు 27
హెల్ క్యాంప్: టీన్ నైట్ మేర్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 27
లిటిల్ డిక్సీ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 28
మిస్ శాంపో (మాండరిన్ సినిమా) - డిసెంబరు 28
పోకేమన్ కన్సేర్జ్ (జపనీస్ సిరీస్) - డిసెంబరు 28
అన్నపూరణి (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 29
బ్యాడ్ ల్యాండ్స్ (జపనీస్ సినిమా) - డిసెంబరు 29
బెర్లిన్ (స్పానిష్ సిరీస్) - డిసెంబరు 29
శాస్త్రి విరుద్ శాస్త్రి (హిందీ మూవీ) - డిసెంబరు 29
త్రీ ఆఫ్ అజ్ (హిందీ సినిమా) - డిసెంబరు 29
డేంజరస్ గేమ్: ద లెగసీ మర్డర్స్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 31
ద అబాండడ్ (మాండరిన్ చిత్రం) - డిసెంబరు 31

అమెజాన్ ప్రైమ్(Amazon)

కటాటన్ ఎస్ఐ బాయ్ (ఇండోనేసియన్ మూవీ) - డిసెంబరు 27
టైగర్ 3 (హిందీ చిత్రం) - డిసెంబరు 31

హాట్‌స్టార్

మంగళవారం (తెలుగు సినిమా) - డిసెంబరు 26
12th ఫెయిల్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 29

జీ5(Zee5)

దోనో (హిందీ మూవీ) - డిసెంబరు 29
వన్స్ అపాన్ టూ టైమ్స్ (హిందీ సినిమా) - డిసెంబరు 29
సఫేద్ (హిందీ చిత్రం) - డిసెంబరు 29

జియో సినిమా(Jio Cinema)

ఆస్టరాయిడ్ సిటీ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 25
ఎవ్రిబడీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 30

లయన్స్ గేట్ ప్లే(Lion's Gate play)

ద కర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 29

బుక్ మై షో(Book My Show)

ట్రోల్స్ అండ్ టుగెదర్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 29

Updated On 25 Dec 2023 11:41 AM GMT
Ehatv

Ehatv

Next Story