నయనతార(Nayanthara) హీరోయిన్ కాదు.. ఆమె గొప్ప నటి! రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కొనసాగడమంటే మాటలు కాదు.. ఆమె గ్లామర్ పాత్రలను పోషించగలరు. లేడీ ఓరియెంటెండ్ పాత్రలూ చేయగలరు. అందుకే ఆమె ఇంతకాలం ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్నారు. మామూలుగా హీరోయిన్లకు రెమ్యూనిరేషన్ ఎంతిస్తారు?
నయనతార(Nayanthara) హీరోయిన్ కాదు.. ఆమె గొప్ప నటి! రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కొనసాగడమంటే మాటలు కాదు.. ఆమె గ్లామర్ పాత్రలను పోషించగలరు. లేడీ ఓరియెంటెండ్ పాత్రలూ చేయగలరు. అందుకే ఆమె ఇంతకాలం ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్నారు. మామూలుగా హీరోయిన్లకు రెమ్యూనిరేషన్ ఎంతిస్తారు? టాప్ హీరోయిన్ అయితే అయిదు కోట్ల రూపాయలిస్తారు. నయనతార పారితోషికం ఎంతో తెలుసా? అక్షరాల పది కోట్ల రూపాయలు. మన దగ్గర కొందరు అగ్రహీరోలకు కూడా ఇంత రెమ్యూనిరేషన్ లేదంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం నయనతార అన్నపూరణి అనే సినిమా(Annapoorani Movie) చేస్తున్నారు. ఈమెకు ఇది 75వ సినిమా. ఈ సినిమా తర్వాత ఆమె ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్నారు. అరుణ్ రాజా కామరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ నిర్మించబోతున్న ఈ సినిమాకు నయన్ పది కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటున్నారు. ఓ విధంఆ హీరోయిన్ల పారితోషికాల విషయంలో ఇది సౌతిండియా రికార్డు. ఓ వైపు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే, తల్లిఆ బిడ్డల ఆలనాపాలనా చూసుకుంటూనే,మరోవైపు సూపర్‌స్టార్‌గా తన స్థాయిని పెంచుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు నయన్. వంద సినిమాలను పూర్తి చేయాలన్నది నయనతార లక్ష్యం. ఆ లక్ష్యాన్ని వీలైనంత తొందరలోనే ఆమె ఛేదించగలరనిపిస్తోంది!