లేడి సూపర్‌స్టార్ నయనతార(Nayanthara) నటించిన అన్నపూరణి(Anapurni) సినిమా థియేటర్లలో ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో తెలియదు. ఎందుకంటే ఆ సినిమా ఊహించని విధంగా ఫ్లాప్ అయ్యింది. అయితేనేం ఓటీటీలో(OTT) మాత్రం దుమ్ము రేపుతోంది. నలభై ఏళ్ల వయసులోనూ నయనతార యువ హీరోయిన్లకు ధీటుగా వరుస సినిమాలు చేస్తోంది. ప్రేక్షకులను అలరిస్తోంది. మొన్నటికి మొన్న జవాన్(Jawan) సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను కూడా మెస్మరైజ్ చేసింది. ఇటీవలి కాలంలో తను ఎంచుకున్న సబ్జెక్టులన్నీ కథానాయికకు ప్రాధాన్యమున్న పాత్రలే కావడం విశేషం. లేడి ఓరియెంటెడ్ సినిమాలకు పెద్ద పీట వేస్తున్నది నయనతార.
లేడి సూపర్‌స్టార్ నయనతార(Nayanthara) నటించిన అన్నపూరణి(Anapurni) సినిమా థియేటర్లలో ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో తెలియదు. ఎందుకంటే ఆ సినిమా ఊహించని విధంగా ఫ్లాప్ అయ్యింది. అయితేనేం ఓటీటీలో(OTT) మాత్రం దుమ్ము రేపుతోంది. నలభై ఏళ్ల వయసులోనూ నయనతార యువ హీరోయిన్లకు ధీటుగా వరుస సినిమాలు చేస్తోంది. ప్రేక్షకులను అలరిస్తోంది. మొన్నటికి మొన్న జవాన్(Jawan) సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను కూడా మెస్మరైజ్ చేసింది. ఇటీవలి కాలంలో తను ఎంచుకున్న సబ్జెక్టులన్నీ కథానాయికకు ప్రాధాన్యమున్న పాత్రలే కావడం విశేషం. లేడి ఓరియెంటెడ్ సినిమాలకు పెద్ద పీట వేస్తున్నది నయనతార. డిసెంబర్‌లో విడుదలైన అన్నపూరణి కూడా అలాంటిదే. కథ గొప్పగా ఏమీ లేదు. టేకింగ్ కూడా మామూలుగానే ఉంది. పైగా సినిమా విడుదలైన సమయంలోనే తమిళనాడులో వరదలు వచ్చాయి. దాంతో సినిమా ఘోరంగా దెబ్బతిన్నది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళంలో పాటు హిందీ భాషలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. చిత్రమేమిటంటే ఓటీటీలో మాత్రం సినిమా టాప్‌ప్లేస్‌లో నిలవడం. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్(అచ్యుత్ కుమార్) స్వామివారి ప్రసాదాలు వండుతుంటారు. ఆయన కూతురు అన్నపూరణి (నయనతార). చిన్నప్పటి నుంచే తండ్రిని చూస్తూ ఇండియాలోనే పెద్ద చెఫ్ కావాలని అనుకుంటుంది. అయితే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె.. నాన్ వెజ్ ముట్టుకోవడంపాపం అని తండ్రి అంటాడు. మరి చిన్నప్పటి నుంచి అనుకున్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? చివరకు అనుకున్నది సాధించిందా లేదా? అనేది తెలియాలంటే అన్నపూరణి మూవీ చూడాల్సిందే. నయనతార కోసం సినిమా చూడొచ్చు. అంతకు మించి చెప్పుకోదగింది సినిమాలో ఏమీ లేదు.