నైనా గంగూలీ.. ఈ బ్యూటీ 2016లో సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘వంగవీటి’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. రత్నకుమారి పాత్రలో తెలుగు ప్రేక్షలను అలరించింది.
1994 ఏప్రిల్ 17న వెస్ట్ బెంగాల్ లోని కోల్ కతాలో జన్మించింది నైనా. 2016 తర్వాత నైనా ‘మేరీ బేటీ సన్నీ లియోన్ బన్నా చాహతి హై’ అనే షార్ట్ ఫిలింలో నటించి ఇటు యూట్యూట్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఇక ఆ తర్వాత బెంగాలీ వెబ్ సిరీస్ అయిన ‘చరిత్రహీన్’ మూడు సీజన్లలోనూ కిరణ్మయి పాత్రతో అభిమానులను మరింత పెంచేసుకుంది ఈ ముద్దుగుమ్మ. 2020లో అంటే నాలుగేళ్ల తర్వాత వచ్చిన ‘జోహార్’ సినిమాలో బాల క్యారెక్టర్ తో మన ముందుకొచ్చింది నైనా గంగూలీ.
2021లో ఆర్జీవీ డైరెక్షన్ లో వచ్చిన ‘డీ కంపెనీ’ లో నటించి అటు బాలీవుడ్ లోనూ అభిమానులను సంపాదించుకుంది. ఇక తెలుగులో ‘పరంపర’, ‘మళ్లీ మొదలైంది’, ‘మా ఇష్టం’ వంటి సినిమాలతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ
ఇదిలా ఉంటే వీలున్నప్పుడల్లా హాట్ హట్ ఫొటో షూట్ లు చేస్తూ.. సోషల్ మీడియాను ఊపు ఊపేస్తుంటుంది. అయితే రీసెంట్ టైమ్స్ లో ఎద అందాలను చూపిస్తూ కుర్రకారుకు మతులు పోగొడుతుంది ఈ ఆర్జీవి భామ నైనా.
ఇక ఈమెకు స్మిమ్మింగ్, ట్రావెలింగ్ అంటే ఇష్టమట. తనకి ఇష్టమైన యాక్టర్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అట. అదలా ఉంటే మూడేళ్ల కిందట ఓ ఈవెంట్ లో రామ్ గోపాల్ వర్మతో స్టేజీపైన ఐ టు ఐ ఇస్తూ డాన్స్ చేసి అందరి గుండెలను పిండేసింది ఈ బెంగాలీ భామ.
ఇక తాజాగా బ్లాక్ బ్రా వేసుకుని చూపులు గుచ్చుకునేలా చూస్తూ.. ఎద అందాలను చూపిస్తూ ‘ఐ వాట్ టూ షైన్ ఇన్ యువర్ ఐస్ ది వే దట్ స్టార్స్ డూ’ అనే క్యాప్షన్ తో ఓ ఫొటో షేర్ చేసింది నైనా.
అయితే ఇప్పటికే 4వేలకు పైగా లైక్స్ ను సొంతం చేసుకుంది. ఈ భామకు ఇన్ స్టాగ్రామ్ లో 9 లక్షలకు పైగా ఫాలోవర్ల ఉన్నారు ఈ హాట్ హీరోయిన్ నైనా గంగూలీకి.