బాలీవుడ్‌ హీరోయిన్‌ నగ్మా(Nagma) పెద్దింటి అల్లుడు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ సినిమా విజయవంతం కావడంతో నగ్మాకు తెలుగులో వరుస ఆఫర్లు వచ్చాయి. దర్శక నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కట్టారు. ఆనాడున్న అగ్ర హీరోలందరి సరసన నటించారు నగ్మా. షార్ట్‌ పిరియడ్‌లోనే ఆమె బిజీ స్టార్‌ అయ్యారు.

బాలీవుడ్‌ హీరోయిన్‌ నగ్మా(Nagma) పెద్దింటి అల్లుడు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ సినిమా విజయవంతం కావడంతో నగ్మాకు తెలుగులో వరుస ఆఫర్లు వచ్చాయి. దర్శక నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కట్టారు. ఆనాడున్న అగ్ర హీరోలందరి సరసన నటించారు నగ్మా. షార్ట్‌ పిరియడ్‌లోనే ఆమె బిజీ స్టార్‌ అయ్యారు. తెలుగు, హిందీలలోనే కాదు, తమిళ, మలయాళ, కన్నడ, భోజ్‌పురి, పంజాబి, బెంగాలీ, మరాఠి భాషల్లోనూ నగ్మా హీరోయిన్‌గా రాణించారు. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిన తర్వాత తల్లి, అత్త పాత్రల్లోనూ మెరిశారు నగ్మా. ఆమె తెలుగు సినిమాల్లో కనిపించక దాదాపు రెండు దశాబ్దాలు అవుతోంది. ఆ తర్వాత ఇతర భాషల్లో నటించిన నగ్మా 2008లో నటనకు గుడ్‌బై చెప్పారు. రాజకీయాల్లో(Politics) అడుగుపెట్టారు. స్టార్‌ హీరోయిన్‌గా ఉన్నప్పుడు నగ్మా చాలా మందిని ప్రేమించారు కానీ ఏ ప్రేమ కూడా పెళ్లి(Marriage) వరకు వెళ్లలేదు.

ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయారు. మరో రెండేళ్లలో 50వ పడిలో ప్రవేశించబోతున్న నగ్మా లేటెస్ట్‌గా తన పెళ్లి గురించి మాట్లాడారు. 'పెళ్లి చేసుకోకూడదు అన్న ఆలోచన నాకు లేదు. ఇంకా చెప్పాలంటే నాకంటూ ఓ తోడు ఉండాలి, పిల్లలుండాలని నా ఆశ. పెళ్లి ద్వారా ఓ కుటుంబాన్ని ఏర్పరుచుకోవాలనే కోరిక బలంగా ఉండింది. కాలం కలిసొస్తే త్వరలోనే నా పెళ్లి జరుగుతుందేమో చూడాలి. నిజంగా పెళ్లయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీలవుతాను. సంతోషమనేది జీవితంలో కొంతకాలానికే పరిమితం కాదు కదా!' అని నగ్మా అన్నారు. అప్పట్లో నగ్మా నలుగురిని ప్రేమించారని అంటుంటారు. నటుడు శరత్‌కుమార్‌ను ప్రేమించారు కానీ అప్పటికే ఆయనకు పెళ్లయింది.. తర్వాత మనోజ్‌ తివారి, రవి కిషన్‌, క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీలతో ప్రేమ వ్యవహారం నడిపారని అంటుంటారు. చిత్రమేమిటంటే ఈ ముగ్గురు కూడా వివాహితులు కావడం. అందుకే ఈ ప్రేమలన్నీ పెళ్లి వరకు వెళ్లక ముందే బ్రేకప్‌ అయ్యాయి. అయితే నగ్మాతో తనది ఫ్రెండ్‌షిప్‌ మాత్రమేనని ఇటీవలే రవికిషన్‌ క్లారిటీ ఇచ్చారు.

Updated On 30 Aug 2023 2:01 AM GMT
Ehatv

Ehatv

Next Story