✕
Nabha Natesh : పెయింటింగ్స్‌తో మనసు దోచుకున్న ఇస్మార్ట్ భామ.. వైరల్ అవుతున్న చార్లీ చాప్లిన్ ఫొటోలు.. !
By EhatvPublished on 1 Jun 2023 1:00 AM GMT
తెలుగు, కన్నడ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నభా నటేష్(Nabha Natesh). 2015లో శివరాజ్‌కుమార్ సరసన ‘వజ్రకాయ’ అనే కన్నడ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత లీ, సాహెబా వంటి చిత్రాల్లో నటించింది.

x
Nabha Natesh
-
- తెలుగు, కన్నడ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నభా నటేష్(Nabha Natesh). 2015లో శివరాజ్‌కుమార్ సరసన ‘వజ్రకాయ’ అనే కన్నడ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత లీ, సాహెబా వంటి చిత్రాల్లో నటించింది. 2018లో నన్ను దోచుకుందువటే (Nannu Dochukunduvate) చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది.
-
- తాజాగా ఈ భామ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటొలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో లెజెండరీ కామిక్ యాక్టర్ చార్లీ చాప్లిన్ పెయింటింగ్‌తో ఉన్న ఓ ఫోజును చూపించింది. హాఫ్ షోల్డర్ వైట్ డ్రెస్ వేసుకుంది నభా. ఇక ఈమె నార్మల్ మేకప్‌తో అభిమానులను ఆకట్టుకుంది.
-
- తన పోస్ట్ కు క్యాప్షన్ ఇస్తూ.. ‘ ‘నా ఫస్ట్ ఎవర్ 4X4 కాన్వాస్, ది లెజెండరీ చార్లీ చాప్లిన్ (Charlie Chaplin) పెయింటింగ్‌ను వేసింది. చార్లీ చాప్లిన్ జీవితం నాకు ఎప్పుడూ స్పూర్తినిస్తూనే ఉంటుంది, నటుడిగా మనిషిగా.. జనాల ముఖాల్లో చిరునవ్వులు చిందిస్తూ మానవాళికి సేవ చేయడానికి తన జీవితం అంకితం చేశారని.. ఈ లెజెండ్‌కు, ఆయన జీవితానికి నా నివాళి’’ అంటూ రాసుకొచ్చింది.
-
- మరోవైపు ఆమె అందానికి, ఆమె పెయింటింగ్ కు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఈ బ్యూటీ లెహెంగాలో ఫోజులు ఇచ్చింది. ఆమె తన బ్యూటిఫుల్ ఫ్యాషన్ సెన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ ముద్దుగుమ్మ బ్యూటీని చూడటానికి అభిమానులు ఉండలేకపోతున్నారు.
-
- ఇక కెరీర్ విషయానికి వస్తే.. డిస్కో రాజా, వజ్రకాయ, సోలో బ్రతుకే సో బెటర్, నన్ను దోచుకుందువటే చిత్రాలతో నభా నటేష్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఆ గుర్తింపును ఇంకాస్త పెంచుకుంది.
-
- 2013 ఫెమినా మిస్ ఇండియా బెంగళూరు టాప్ 11 లిస్టులో చోటు దక్కించుకుంది. 2013 ఫెమినా మిస్ ఇండియా బెంగుళూరు టాప్ 11 జాబితాలో చోటు దక్కించుకుంది.ఈ బ్యూటీకి ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 4.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story