✕
Mrunal Thakur : శిల్పాల నడుమ దేవకన్యలా మృణాల్ ఠాకూర్ అందాలు
By EhatvPublished on 11 March 2023 4:51 AM GMT
మృణాల్ ఠాకూర్ అంటే టక్కున స్ట్రయిక్ అవ్వకపోవచ్చమో గానీ.. ‘సీతారామం’ మూవీ హీరోయిన్ అంటే మాత్రం గుర్తు పట్టకమానరు. 2022 ఆగస్టులో రిలీజైన ఈ మూవీతో తెలుగు ఆడియన్స్‌లో ఈ అమ్మడు మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంది.

x
Mrunal Thumbnail
-
- మృణాల్ ఠాకూర్ అంటే టక్కున స్ట్రయిక్ అవ్వకపోవచ్చమో గానీ.. ‘సీతారామం’ మూవీ హీరోయిన్ అంటే మాత్రం గుర్తు పట్టకమానరు. 2022 ఆగస్టులో రిలీజైన ఈ మూవీతో తెలుగు ఆడియన్స్‌లో ఈ అమ్మడు మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంది.
-
- ఈ అమ్మాయి మహారాష్ట్రలోని ధులేలో 1992 ఆగస్టు 1న జన్మించింది. ఈమె సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్ చదువుకుంది. ఆ తర్వాత వసంత్ విహార్ హైస్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది.
-
- ఇక ఆ తర్వాత కేసీ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి నటన రంగంవైపు అడుగులు వేసింది. 2012-13లో వచ్చిన ‘ముజ్సే కుచ్ కెహ్తీ.. యే ఖామోషియా’ అనే సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచమైంది ఈ అమ్మడు.
-
- 2014 నుంచి 2016 వరకు ‘కుమ్ కుమ్ భాగ్య’ సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది ఈ భామ. ఆ తర్వాత ‘నాచ్ బాలియే7’, ‘సౌభాగ్యలక్ష్మీ’, ‘తుయుల్ అండ్ ఎంబాక్ యుల్ రీబోర్న్’, ‘నాదిన్’ వంటి వాటిలో నటించి అలరించింది.
-
- ఇక 2020 నుంచి 2021లో పలు మ్యూజిక్ వీడియోలను కూడా చేసింది ఈ సీత. అయితే 2014లోనే ‘విట్టి దండు’ అనే మరాఠి చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది మృణాల్ ఠాకూర్. మరాఠీలో రెండు చిత్రాల తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.
-
- 2018లో వచ్చిన ‘లవ్ సోనియా’ చిత్రంలో సోనియా గుప్తా క్యారెక్టర్‌తో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన ఈమె.. ‘సూపర్30’, ‘బత్లా హౌస్’, ‘ఘోస్ట్’, ‘తూఫాన్’, ‘ధమాకా’, జెర్సీ వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకుల ఆదరణ మరింత పొందింది.
-
- 2022లో ‘సీతా రామం’ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మృణాల్ ఠాకూర్.. ఒక్క సినిమాతోనే తెలుగు ఆడియన్స్ మనసుల్లో సీతగా బలమైన ముద్ర వేసుకుంది. ఈ మూవీతోనే ప్రేక్షకుల్లో కూడా ఆమెకు మంచి ఫాలోయింగ్ తో పాటు ఆదరణ కూడా విపరీతంగా పెరిగింది.
-
- ‘సీతా రామం’ తర్వాత రెండు హిందీ మూవీస్ రిలీజ్ సిద్దంగా ఉండగా.. మరో మూడు చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ‘నాని30’ చిత్రంలోనూ నటిస్తోంది ఈ భామ. ఈ మూవీలో నాని సరసన ఎలాంటి పాత్ర చేస్తుందో అని మృణాల్ అభిమానులు తెగ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
-
- అయితే ఈ భామ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సీతగా ముద్రపడటం వలన ఆమె మోడ్రన్ డ్రెస్సుల్లో కనిపించినప్పుడు ఫ్యాన్స్ కాస్త ఇబ్బందిగా ఫీలవుతున్నారు. ఒక్కోసారి ఘాటు కమెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా తీయబోయే సినిమాలోనూ నటించనుంది ఈ నార్త్ భామ.
-
- సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోషూట్ పిక్స్ షేర్ చేసే ఈమె.. తాజా మరికొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలకు మృణాల్ అభిమానులు రకరకాలుగా కమెంట్స్ చేస్తున్నారు. కొంతమంది పాజిటివ్‌గానూ.. ఇంకొందరు నెగెటివ్‌గానూ మెసెజెస్ చేస్తున్నారు.
-
- ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు ఇన్‌స్టాలో 8.1 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. 2,708 పోస్టులను షేర్ చేసింది మృణాల్.

Ehatv
Next Story