బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. ఆ మరాఠీ అమ్మాయిని సీతారామంలో చూసిన వారు ఆమెను తెలుగమ్మాయే అని అనుకున్నారు. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ తెలుగుతో పాటు హిందీలో కూడా నటిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని(Nani), విజయ్ దేవరకొండ(Vijay devarkonda) సినిమాల్లో హీరోయిన్‌గా మృణాల్ నటిస్తున్నారు. ఇటీవల ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సహనటులపై ప్రశంసలు కురిపించారు మృణాల్. వాళ్లందరూ ఎంతో మంచివారని, వారి పరిచయం వల్ల జీవితాన్ని కొత్త దృక్కోణంలో చూస్తున్నానని మృణాల్ తెలిపారు.
బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. ఆ మరాఠీ అమ్మాయిని సీతారామంలో చూసిన వారు ఆమెను తెలుగమ్మాయే అని అనుకున్నారు. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ తెలుగుతో పాటు హిందీలో కూడా నటిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని(Nani), విజయ్ దేవరకొండ(Vijay devarkonda) సినిమాల్లో హీరోయిన్‌గా మృణాల్ నటిస్తున్నారు. ఇటీవల ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సహనటులపై ప్రశంసలు కురిపించారు మృణాల్. వాళ్లందరూ ఎంతో మంచివారని, వారి పరిచయం వల్ల జీవితాన్ని కొత్త దృక్కోణంలో చూస్తున్నానని మృణాల్ తెలిపారు. సీతారామం సినిమాలో దుల్కర్ సల్మాన్‌తో(Dulqer Salmaan) కలిసి నటించిన మృణాల్ అతడి ద్వారా సంభాషణలు ఎలా చెప్పాలో నేర్చుకున్నారట! 'ఇప్పుడు ఎలాంటి పొరపాట్లు లేకుండా డైలాగ్స్ చెప్పగలననే నమ్మకం ఏర్పడింది. ఇక నాని చాలా సింపుల్‌గా ఉంటాడు. కెరీర్ అంటే పరుగుపందెం కాదని, అందరికంటే ముందుండాలనే కోరిక వల్ల మనశ్శాంతి కోల్పోతామని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు’ అని మృణాల్ చెప్పుకొచ్చారు. సీతారామం సినిమా తన కెరీర్‌లో మైలురాయి వంటిదని, ఆ సినిమాలో అవకాశాన్నిచ్చిన దర్శకుడు హను రాఘవపూడికి జీవితాంతం కృతజ్ఞతగా ఉంటానని తెలిపారు . ప్రస్తుతం మృణాల్ తెలుగు, తమిళం, హిందీలో భాషల్లో ఐదు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.