మృణాల్ ఠాకూర్(Mrunal thakur) ఈ హరోయిన్‌ ఎంత పాపులరయిందో తెలుసు.

మృణాల్ ఠాకూర్(Mrunal thakur) ఈ హరోయిన్‌ ఎంత పాపులరయిందో తెలుసు. వరుస ఆఫర్లను అందిపుచ్చుకుంటూ బాలీవుడ్, టాలీవుడ్‌ సహా ఇతర ఇండస్ట్రీల్లో దూసుకుపోతుంది. తెలుగులో ఎంట్రీ మూవీతోనే అదరగొట్టిన ఈ భామ ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. తన శరీర సౌందర్యాల గురించి నిర్మొహమాటంగా చెప్పింది. నావి పెద్దగా ఉంటాయి చూపిస్తే తప్పు ఏంటని ఎదురు ప్రశ్నించింది.

మోడల్‌గా ఫుల్‌ క్రేజ్‌ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ముజ్‌ కే కుచ్‌ కెహతీ.. యే కామోషియాన్ అనే సిరీయల్‌ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. వెంటవెంటనే ఆఫర్లు రావడంతో పలు సీరియళ్లలో నటించి మెప్పించింది. ఆ తర్వాత మరాఠి సినిమా 'విట్టిదండు'తో హీరోయిన్‌గా చాన్స్‌ కొట్టేసింది. ఆ సినిమలో అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో సినిమాల్లో కూడా వరుస ఆఫర్లు వచ్చాయి. హిందీలో కూడా ఎన్నో సినిమాలు, సీరియళ్లు చేసిన మృణాల్‌కు టాలీవుడ్‌లో ఒక గట్టి సినిమా దొరికింది. రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా వచ్చిన 'సీతారామం'(sitaramam) సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది. ఊహించని విధంగా సీతారామం సినిమా హిట్‌ కొట్టంది..తెలుగు ప్రేక్షకుల గుండెలు కొల్లగొట్టింది. ఈ సినిమాతో టాలీవుడ్‌లో కూడా మృణాల్ ఠాగూర్‌ బిగ్‌ సెలెబ్రిటీ అయింది, పెద్ద ఎత్తున ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను పెంచుకుంది. ఈ సినిమా హిట్‌తో తెలుగులో సంచలన హీరోయిన్‌గా మారడంతో తన బిజినెస్‌ను కూడా పెంచుకుంది. మరో సినిమా హాయ్‌ నాన్న(Hi nana) కూడా మంచి విజయాన్నే అందించింది. ఇక మరో సినిమా ది ఫ్యామిలీ స్టార్ మాత్రం అనుకున్న విజయం సాధించకపోయినప్పటికీ బాలీవుడ్‌లో పెద్ద ఆఫరే కొట్టింది. బాలీవుడ్‌లో పూజా మేరి జాన్(Puja meri jaan) అనే సినిమాలో నటిస్తోంది. ఇటు తెలుగులో కూడా రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో సినిమా చేయనుందని టాలీవుడ్‌ టాక్.

అయితే తాజాగా పలు ఇంటర్వ్యూలో మృణాల్‌ ఠాకూర్ పాల్గొంది. మీడియాతో చిట్‌చాట్‌లు కూడా చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన శరీర అవయవాలపై వివరణ ఇచ్చుకుంది. తన బాడీలో అందరూ తన 'తొడల' గురించే మాట్లాడుకుంటారని, నా బాడీలో తొడలే పెద్దగా ఉంటాయి కనుక అవి ప్రేక్షకులకు, అభిమానులకు చూపిస్తే తప్పేంటి అని ఎదురు ప్రశ్నించింది. నాకు తొడలు దేవుడు ఇచ్చాడు, వాటిని చూపించడలో నాకు ఇబ్బంది ఎందుకు ఉంటుందని అడిగింది. నేను వర్కవుట్‌ చేసే సమయంలో కూడా వాటినే చూస్తారని, అవి తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారా అని అడిగితే లేదు అనే సమాధానమిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. ఈ రకంగా తన 'తొడల'(Tigh) సంగతినైతే బయటపెట్టింది మృణాల్ ఠాకూర్.

Eha Tv

Eha Tv

Next Story