ఎగ్ ఫ్రీజింగ్(Egg freezing) గురించి మీరు వినే ఉంటారు. ప్రసత్తుం చాలా మంది చాలా ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కొందరు వృత్తిరీత్యా, ఇంకా అనేక కారణాల వల్ల వివాహాలు ఆలస్యంగా చేసుకుంటున్నారు. 30 ఏళ్లు దాటిన తర్వాత అండాలు ఆరోగ్యంగా ఉండవని వైద్య నిపుణులు చెప్తుండడంతో కొందరు తమ అండాలను దాచుకుంటున్నారు.
ఎగ్ ఫ్రీజింగ్(Egg freezing) గురించి మీరు వినే ఉంటారు. ప్రసత్తుం చాలా మంది చాలా ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కొందరు వృత్తిరీత్యా, ఇంకా అనేక కారణాల వల్ల వివాహాలు ఆలస్యంగా చేసుకుంటున్నారు. 30 ఏళ్లు దాటిన తర్వాత అండాలు ఆరోగ్యంగా ఉండవని వైద్య నిపుణులు చెప్తుండడంతో కొందరు తమ అండాలను దాచుకుంటున్నారు. పెళ్లి తర్వాతనో, తమకు అనుకూలంగా ఉన్న సమయంలో దాచుకున్న అండాలతో పిల్లలను కనొచ్చులే అని ముందు జాగ్రత్త పడుతున్నారు. పెళ్లికి ముందే తమ 'ఎగ్స్'ను ఫ్రీజ్ చేసుకుని జాగ్రత్త పడుతున్నారు.
అయితే ఈ జాబితాలో టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్(Actress Mehreen) చేరింది. గతంలో 'ఎగ్ ఫ్రీజింగ్' అని హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) చెప్పడంతో ఆమెను ఫాలో అయింది మెహ్రీన్. తన ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం చాలా మంది సెలబ్రిటీలు ఈ ఎగ్ ఫ్రీజింగ్‌ను ఫాలో అవుతున్నారు. వయసులో ఉన్నప్పుడు తమ ఎగ్స్‌ను ఫ్రీజ్ చేసుకుని తమకు నచ్చిన సమయంలో పిల్లలను కనేందుకు ముందస్తు ప్లాన్ వేస్కుంటున్నారు. ఈ సందర్భంగా మోహ్రీన్ తన ఎగ్స్ ఫ్రీజింగ్ ప్రక్రియ గురించి వివరిస్తూ.. ' దీని కోసం గత రెండు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాని తెలిపింది. ఎట్టకేళకు ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నానని వివరించింది. అయితే ఈ విషయాలను ఇతరులకు షేర్ చేసుకోవాలో వద్దో అని ఆలోచించానని తెలిపింది. తల్లి కావడమనేది నా కల, దాదాపు అందరి మహిళల కల. కాకుంటే ఇది కొన్ని రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఆ సమయంలో ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఉపయోగపడుతుందని.. నేను మాత్రం భవిష్యత్తు కోసం ఇది చాలా ముఖ్యమని భావించాను.. కానీ ఆస‍్పత్రులంటే భయముండే నాలాంటి వాళ్లకు ఇది చాలెంజింగ్ సమస్యనే అని వివరించింది. ఇంజెక్షన్స్ కారణంగా ఆస్పత్రికి వెళ్లిన ప్రతిసారీ నేను కళ్లు తిరిగి పడిపోయేదాన్ని. ఇక ఎగ్ ఫ్రీజింగ్ మంచిదా కాదా అంటే.. కచ్చితంగా మంచిదే అని. మీరు ఏం చేసినా సరే మీకోసం చేయాలని సలహాలు ఇచ్చింది. ఈ ప్రక్రియకు సహకరించిన గైనకాలజిస్ట్ డాక్టర్ రిమ్మీ, మా అమ్మకు థ్యాంక్స్ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.