నటి మీనా అంటే..బహుశా తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోలసరసన నటించి తన నటనతో ఔరా అనిపించింది. మంచి స్టార్ డమ్ ఉన్న సమయంలోనే విద్యాసాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. 2022లో భర్త విద్యాసాగర్ అకాల మరణం పొందిన సంగతి తెలిసిందే. అయితే మీనా రెండో పెళ్లి చేసుకుంటోందని ఇటీవల వచ్చిన వార్తలపై ఆమె ఆసక్తికర కామెంట్స్ చేసింది.

నటి మీనా(Actress Meena) అంటే..బహుశా తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోల(Tollywood Top heroes )సరసన నటించి తన నటనతో ఔరా అనిపించింది మీనా. మంచి స్టార్ డమ్ ఉన్న సమయంలోనే విద్యాసాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైపోయింది. 2022లో భర్త విద్యాసాగర్(Husband Vidyasagar) అకాల మరణం(untimely death) పొందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన రెండేళ్ల కూతురు(Two year old daughter)తో కలిసి మీనా జీవనం సాగిస్తోంది. అయితే మీనా రెండో పెళ్లి(Second Marriage) చేసుకుంటోందని పలు వార్తలు వచ్చాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రెండో పెళ్లి విషయంపై స్పందించిన మీనా..తన మనసులో మాటని బయటపెట్టింది. "నేను తెలుగు, తమిళ్‌లో అగ్ర నటుల సరసన నటిస్తానని ఏనాడూ అనుకోలేదు. ప్రస్తుతానికి నాకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు, అలాగని ఒంటరిగా ఉంటానని కాదు. పెళ్లి చేసుకోకుండా ఉండటమూ కష్టమేమీ కాదు కదా..నా సుఖం, సంతోషం మాత్రమే కాదు.. నాకంటే..నా కూతురు భవిష్యత్తు చాలా ముఖ్యం. ఎవరి పరిస్థితి వాళ్లది. చిన్న వయసు..పెద్ద వయసు అని కాదు. ఎందుకంటే నా ఫ్యూచర్ గురించి నేనేమీ అనుకోలేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు కదా..వేచి చూడాల్సిందేనంటూ" చెప్పుకొచ్చింది నటి మీనా.

Updated On 4 Jan 2024 4:57 AM GMT
Ehatv

Ehatv

Next Story