మంచు లక్ష్మి(Manchu lakshmi).. తెలుగురాష్ట్రాల్లో పరిచయంలేని పేరు.

మంచు లక్ష్మి(Manchu lakshmi).. తెలుగురాష్ట్రాల్లో పరిచయంలేని పేరు. నటిగా, నిర్మాతగా, యాంకర్‌గా రాణిస్తోంది. బుల్లితెరపైకూడా మంచులక్ష్మి సుపరిచుతురాలు. సూపర్ జోడి, ఆట జూనియర్స్ వంటి రియాల్టీషోలకు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించింది. టెలివిజన్‌ రంగంలో అనేక అవార్డులను కూడా అందుకుంది. ఆమె ఇంగ్లీష్, యాక్టింగ్, గ్లామర్‌లో తనదైన ముద్ర వేసింది. ముఖ్యంగా మంచు లక్ష్మి స్పీచ్‌లకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఇటీవలే ఆదిపర్వం అనే సినిమా చేసింది మంచు లక్ష్మి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ మధ్యనే బీచ్‌లో బికినీ వేసి తన ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది.




ప్రస్తుతం బిగ్‌బాస్‌ సీజన్‌-8(Bigg Boss Season 8) నడుస్తోంది. ఈ సీజన్ ప్రారంభం నుంచి ఊహించని టాస్కులు ఇస్తున్నారు. అంతేకాకుండా సీజన్‌8లో కాంట్రవర్సీలు, గొడవలు, లవ్ సోర్టీలు, రొమాంటిక్ మూమెంట్స్‌తో కంటెస్టెంట్స్‌ రెచ్చిపోతున్నారు. తొలివారంలోనే యూట్యూబర్ బెజవాడ బేబక్క(Bezawada bebakka) ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం హౌస్ లో 13 మంది కంటెస్టెంట్లే ఉన్నారు.ఈ వారం కూడా మరో ఎలిమినేషన్‌ ఉంటుందని సమాచారం. ఇదిఇలా ఉండగా బిగ్‌బాస్‌లోకి మంచులక్ష్మి గెస్ట్‌గా(Guest) ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. గతంలో కూడా ఒకసారి బిగ్‌బాస్‌లోకి గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన మంచులక్ష్మి..




అప్పట్లో నానా రచ్చ రచ్చ చేసింది. ఇంటి సభ్యులతో ఆనందంగా గడిపింది. అంతేకాకుండా అవసరమైనప్పుడల్లా కొందరికి చురకలు అంటించింది. కొందరిని ప్రశంసలతో ముంచెత్తింది. బిగ్‌బాస్‌ను రెగ్యులర్‌గా చూస్తానని తెలిపింది. కానీ ఇంగ్లీష్‌లో గలాగలా మాట్లాడడంతో అప్పుడు బిగ్‌బాస్‌ హోస్ట్‌గా ఉన్న నాని, మంచులక్ష్మికి ఓ పరీక్ష పెట్టాడు. బిగ్‌బాస్‌ హౌజ్‌లో తెలుగులోనే మాట్లాడాలని షరతు పెట్టడంతో ఆమె తెలుగులో మాట్లాడుందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అయితే తాజాగా మరోసారి ఈ సీజన్‌లో కూడా హౌజ్‌లోకి మంచు లక్ష్మి ఎంట్రీ ఇస్తుందని సమాచారం. ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చే బిగ్‌బాస్‌ మంచు లక్ష్మిని ప్రవేశపెట్టి కంటెస్టులకు ఎప్పుడు ట్విస్ట్ ఇస్తారో అని చూస్తున్నారు.





Updated On 15 Sep 2024 6:40 AM GMT
Eha Tv

Eha Tv

Next Story