ఫిల్మ్ ఇండస్ట్రీ(Film industry))లో కాస్టింగ్ కౌచ్(Casting couch) బాధితులు ఎందరో.. ఇదివరకు చెప్పుకునేవారు కాదు. కాని ఇఫ్పుడు మీటూ ఉద్యమంతో.. ధైర్యం తెచ్చుకుని చాలా మంది బయటకు వస్తున్నారు. తమకు జరిగిన అనుభవాలు బయటకు చెప్పుకుంటున్నారు. కొంత మంది విషయంలో ఇవి వివాదాలుగా మారాయి. ఒక రకంగా ఇండస్ట్రీని మీటూ ఉద్యమం కుదిపేసింది. కాస్టింగ్ కౌచ్ అన్ని భాషల ఇండస్ట్రీలలో బయటకు వచ్చాయి. విచిత్రం ఏంటంటే.
ఫిల్మ్ ఇండస్ట్రీ(Film industry))లో కాస్టింగ్ కౌచ్(Casting couch) బాధితులు ఎందరో.. ఇదివరకు చెప్పుకునేవారు కాదు. కాని ఇఫ్పుడు మీటూ ఉద్యమంతో.. ధైర్యం తెచ్చుకుని చాలా మంది బయటకు వస్తున్నారు. తమకు జరిగిన అనుభవాలు బయటకు చెప్పుకుంటున్నారు. కొంత మంది విషయంలో ఇవి వివాదాలుగా మారాయి. ఒక రకంగా ఇండస్ట్రీని మీటూ ఉద్యమం కుదిపేసింది. కాస్టింగ్ కౌచ్ అన్ని భాషల ఇండస్ట్రీలలో బయటకు వచ్చాయి. విచిత్రం ఏంటంటే.. అబ్బాయిల్లో కూడా కాస్టింగ్ కౌచ్ బాధితులు బయటకు రావడం.. అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇక ఇలాంటి కాస్టింగ్ కౌచ్ బాధితుల్లో ఎందరో హీరోయిన్లు ఉన్నారు. వారిలో తెలుగు బ్యూటీ మాధవిలత కూడా ఒకరు. ఆమె ఎన్నో సార్లు.. కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడారు. తాను కూడా బాధితురాలినే అన్నారు. ఈక్రమంలో మరోసారి కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడారు మాధవి లత(Maadhavi Latha). కొన్ని షాకింగ్ విషయాలువెల్లడించారు. ఇంతకీ మాధవి లత ఏమ్నారంటే..?
సామాన్యంగా నేను ఎవరిని బాధ పెట్టను. కానీ టెంపర్ కోల్పోతే మాత్రం.. ఎదురుగా ఎవరు ఉన్నారు అనేది చూడను. మాటలు అనేస్తాను. నాకు సినీ ఇండస్ట్రీతో ఎలాంటి సమస్యలు లేవు. ఈ విషయం ఎవరూ నమ్మరు. ఎవరైనా నిర్మాతనో.. మరో వ్యక్తో నాతో తప్పుగా మాట్లాడితే.. నేను అరవను. వారి మాటల వల్ల ఎంత కోపం వచ్చినా సరే.. శాంతంగానే బదులిస్తాను. అన్నారు.
అంతే కాదు ఇండస్ట్రీలో నైట్ వస్తావా అని అడిగినవాళ్ళు చాలా మంది ఉన్నారు కాని నేను మీరు అనుకునే మనిషిని కాదండని చెప్పి వెళ్లి పోతాను. ముందు రోజు.. వస్తావా.. అని వంకరగా మాట్లాడిన వాళ్లే.. మరుసటి రోజు నుంచి నన్ను అమ్మ అని పిలిచిన వ్యక్తులు ఉన్నారు. ఇంలాంటి సంఘటనలు జీవితంలో చాలా చూడాల్సి వస్తుంది. వాటికి భయపడకూడదు అన్నారు మాధవి లత.
సినిమాలకు దూరంగా ఉంది మాధవి. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. నచ్చావులే సినిమాతో మంచి విజయం అందుకుంది తెలుగమ్మాయి మాధవి లత. తర్వత వరుసగా కొన్ని సినిమాలు చేసినా..అవి మాత్రం టాలీవుడ్ లో ఆమెకు గుర్తింపు ఇవ్వలేదు. ఇక సినిమాలు వదిలేసి... ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బీజేపీ(BJP)లో చేరింది. ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తోంది. కృష్ణతత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయాలని కృషి చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది మాధవి లత.