రీసెంట్ గా వరుణ్ తేజ్(Varun Tej) చేత మూడు ముళ్లు వేయించుకుని.. మెగా ఇంటి కోడలు అయ్యింది లావణ్య త్రిపాఠి(Lavanya Tripati). మెగా బ్రదర్ నాగబాబు(Naga Babu) కుమారుడు..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య జంటగా మారారు. వీరు ఎవరికీ తెలియకుండా..

రీసెంట్ గా వరుణ్ తేజ్(Varun Tej) చేత మూడు ముళ్లు వేయించుకుని.. మెగా ఇంటి కోడలు అయ్యింది లావణ్య త్రిపాఠి(Lavanya Tripati). మెగా బ్రదర్ నాగబాబు(Naga Babu) కుమారుడు..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య జంటగా మారారు. వీరు ఎవరికీ తెలియకుండా.. దాదాపు 5 ఏళ్ళు సీక్రేట్ గా ప్రేమించుకున్నారు ఇరు కుటుంబాలను ఒప్పించి ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. వారిప్రేమను ఎక్కడైతే వ్యాక్త పరుచుకున్నారో అక్కడే తమ పెళ్లిని గ్రాండ్ గా జరుపుకున్నారు. ఇక రీసెంట్ గానే హనీమూన్ ట్రిప్ ను కంప్లీట్ చేసుకుని ఇండియాకు చేరారు జంట. ఇక తమ షూటింగ్స్ లో బిజీ కాబోతున్నారు.

వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకోవడంతో మెగా కోడలి హోదా వచ్చింది లావణ్యకు దాంతో తన పేరును సోషల్ మీడియాలో అప్ డేట్ చేసింది బ్యూటీ. ఇన్ స్టాలో తన పేరుకు కొణిదెల ట్యాగ్ ను తగిలించింది. అంతకు ముందు లావణ్య త్రిపాఠి మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ పేరు కాస్తా..లావణ్య త్రిపాఠి కొణిదెలగా మారిపోయింది. అయితే ఆమె ఇన్ స్టాలో మాత్రమే తన పేరును అప్ డేట్ చేసింది. ట్విట్టర్ ఎక్స్ లో మాత్రం ఇంకా అప్ డేట్ చేయాల్సి ఉంది.

ఇక లావణ్య త్రిపాటి తన పేరుకు కొణిదెల ట్యాగ్ తగిలించడంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో లావణ్య పేజ్ ను వైరల్ చేస్తున్నారు. ఈ విషయంలో ఫ్యాన్స్ నుదిల్ ఖుష్ చేసింది లావణ్య. దాంతో ఆమె ఫాలోయింగ్ కూడా ఇప్పుడు అమాంతం పెరిగే అవకాశం ఉంది. మరి పెళ్ళి తరువాత ఆమె నటిస్తుందా లేక..ఫ్యామిలీకే పరిమితం అవుతుందా..? లేక నిర్మాణ బాధ్యతలు లాంటివి చూసుకుంటుందా అనేది చూడాలి.

Updated On 21 Dec 2023 6:47 AM GMT
Ehatv

Ehatv

Next Story