మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi)పై మనసులోమాట బయట పెట్టింది సీనియర్ హీరోయిన్ ఖుష్బు(Kushboo). అంతే కాదు మెగా హీరోపై బోల్డ్ కామెంట్స్ చేసింది బ్యూటీ. ఈ ఏజ్ లో మెగాస్టార్ తో రొమాన్స్ చేయాలని ఉంది అంటోంది సీనియర్ హీరోయిన్ కుష్బు. తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది కుష్బు. ఎన్నో బ్లాక్‌ బాస్టర్‌ హిట్ సినిమాలు చేసిన ఖుష్బు..

మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi)పై మనసులోమాట బయట పెట్టింది సీనియర్ హీరోయిన్ ఖుష్బు(Kushboo). అంతే కాదు మెగా హీరోపై బోల్డ్ కామెంట్స్ చేసింది బ్యూటీ.

ఈ ఏజ్ లో మెగాస్టార్ తో రొమాన్స్ చేయాలని ఉంది అంటోంది సీనియర్ హీరోయిన్ కుష్బు. తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది కుష్బు. ఎన్నో బ్లాక్‌ బాస్టర్‌ హిట్ సినిమాలు చేసిన ఖుష్బు.. కు ముఖ్యంగా తమిళంలో డైహాట్ ఫ్యాన్స్ ఎక్కువ. తమిళంలో ఆమె అభిమానులు ఖుష్బును ఒక దశలో దేవవతగా చూశారంటే.. ఆమె రేంజ్ ఏంటో చూడచ్చు. ఒక అభిమాని అయితే ఏకంగా గుడి కూడా కట్టించాడు కుష్బుకు. తొంబైయోవ దశకంలో.. తెలుగు తమిళ బాషలలో సిల్వర్ స్క్రీన్ ను ఒక ఊపు ఊపి వదిలిపెట్టింది కుష్బు. దశాబ్దం పాటు కోలీవుడ్ లోనెంబర్ వన్ హీరోయిన్ గా.. వెలుగు వెలిగింది.

ఇక ఏజ్ పెరుగుతుననా.. బ్యూటీ విషయంలో.. ఫిట్ నెస్ విషయంలో ఏమాత్రం తగ్గడంలేదు కుష్బు. క్యారెక్ర్ రోల్స్ చేస్తున్నా.. ఏమాత్రం గ్లామర్ తగ్గకుండా మెయింటేన్ చేస్తోంది. తాజాగా ఆహె రామబాణం సినిమాలో నటించారు. గోపీచంద్ హీరోగా నటించిన ఈసినిమాలో ఇంపార్టెంట్ పాత్ర చేశారు ఖుష్బు. ఈసినిమా రిలీజ్ కు రెడీగా ఉండగా.. మూవీ టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈసందర్భంలో ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు కుష్బు.

ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది ఖుష్బు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మెగాస్టార్‌ చిరంజీవితో మళ్ళీ.. రొమాన్స్‌ చేయాలన్న తన కోర్కెను బయటపెట్టారు ఖుష్బు. చిరంజీవి నుంచినేర్చుకోవల్సింది చాలా ఉందని. ఆయనో లెజెండ్‌ అంటూ పొగిడారు ఖుష్బు. చిరు మానవత్వం కలిగిన వ్యాక్తి. అంతటి స్టార్ అయినా.. చాలా ఒదిగి ఉంటారు.. చేసే పనిమీద ఆయనకు గౌరవం ఎక్కువ అన్నారు ఖుష్బు. ఆయనతో కలిసి స్టాలిన్ సినిమాలో సోదరిగా చేశారు. ఇప్పుడు ఛాన్స్ వస్తే.. ఆయన జోడీగా రొమాన్స్ చేయాలని ఉంది అన్నారు ఖుష్బు. రీసెంట్ గా ఈ ఇద్దరు స్టార్లు ఓ కమర్షియల్ యాడ్ లో కూడా కనిపించారు.

ఆయనతో కలిసి పని చేయటానికి ఓ మంచి స్క్రిప్టు కోసం చూస్తున్నా.. మెచ్యూర్‌ లవ్‌స్టోరీ, ఫ్యామిలీ డ్రామాలాంటివి చిరంజీవి గారితో చేయాలని ఉంది. అదే నా కల అని అన్నారు ఖుష్బు. మెగాస్టార్ ఖుష్బుకు ఛాన్స్ ఇస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.

Updated On 4 May 2023 7:10 AM GMT
Ehatv

Ehatv

Next Story