చాలా మంది అమ్మాయిలు వెండితెరపై వెలిగిపోవాలిని, టాప్ హీరోయిన్‌గా ఎదిగిపోవాలని అనుకుంటారు. ఆ లక్ష్యంతోనే సినీ రంగంలో అడుగుపెడతారు. కానీ ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్(Kriti Sanon) అలాంటి కలలేమీ కనకుండానే కాకతాళీయంగా చిత్రపరిశ్రమలోకి వచ్చారు.

Kriti Sanon
చాలా మంది అమ్మాయిలు వెండితెరపై వెలిగిపోవాలిని, టాప్ హీరోయిన్‌గా ఎదిగిపోవాలని అనుకుంటారు. ఆ లక్ష్యంతోనే సినీ రంగంలో అడుగుపెడతారు. కానీ ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్(Kriti Sanon) అలాంటి కలలేమీ కనకుండానే కాకతాళీయంగా చిత్రపరిశ్రమలోకి వచ్చారు. అలా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ అందాల భామ అనతికాలంలోనే టాప్ హీరోయిన్ అయ్యారు. మహేశ్‌బాబు(Mahesh Babu) సినిమా నేనొక్కడినేలో హీరోయిన్‌గా కనిపించిన కృతి సనన్ ఈ మధ్యనే ప్రభాస్(Prabhas)తో ఆదిపురుష్ అనే పాన్ ఇండియా సినిమాలో నటించారు. ఇప్పుడు బాలీవుడ్‌లో ఆమె స్టార్ హీరోయిన్. సరోగేటెడ్ తల్లిగా మిమీలో అద్భుతంగా నటించారు కృతి. అందుకే ఈ సినిమాలో ఆమె పోషించిన మిమీ రాథోడ్(Mimi Rathore) పాత్రకు జాతీయ ఉత్తమ నటి పురస్కారం లభించింది. తొలి సినిమా వన్ నేనొక్కడినేలో అగ్రకథానాయకుడు మహేష్‌బాబు సరసన ఆడిపాడింది. హీరోపంటితో విజయవంతమైన హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. దిల్‌వాలే, లుకా ఛుపీ, బరేలీ కీ బర్ఫీ, హౌస్‌ఫుల్ 4 వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కృతి సనన్. గ్లామర్ పాత్రలతో పాటు వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. ఈ ఏడాది ఆదిపురుష్ చిత్రంలో జానకిగా ప్రేక్షకుల్ని పలకరించారు. . ఇటీవలే చిత్రనిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టారు కృతిసనన్. తన సొంత నిర్మాణ సంస్థ బ్లూ బటర్‌ఫ్లై ఫిలిమ్స్(Blue Butterfly Films) పతాకంపై దో పత్తి(Do Patti) సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో కాజోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దిల్‌వాలే సినిమా తర్వాత కాజోల్‌తో కృతి సనన్ నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం!
