బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీ తల్లి కాబోతుందట..అవును బాలీవుడ్ మీడియాలో ఓ రేంజ్ లో జరుగుతున్న ప్రచారం ప్రకారం కియారా అద్వాని ప్రస్తుం ప్రగ్నెంట్(Pregnant) అంట. ఈ విషయం తెగ వైరల్ అవుతోంది. ఈమధ్య బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రను(Siddharth Malhotra) ప్రేమ పెళ్ళి చేసుకుంది కియారా అద్వాని. దాదాపు ఐదారేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు...ఎప్పుడూ బయట పడలేదు. సోషల్ మీడియా కోడై కూసినా..
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని(Kiara Advani) తల్లి కాబోతోందట. బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మరి ఇందులో నిజం ఎంత..? ఆమె ప్రగ్నంల్ అని ఎలా తెలిసింది..? అఫీషియల్ గా ప్రకటన చేశారా..?
బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీ తల్లి కాబోతుందట..అవును బాలీవుడ్ మీడియాలో ఓ రేంజ్ లో జరుగుతున్న ప్రచారం ప్రకారం కియారా అద్వాని ప్రస్తుం ప్రగ్నెంట్(Pregnant) అంట. ఈ విషయం తెగ వైరల్ అవుతోంది. ఈమధ్య బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రను(Siddharth Malhotra) ప్రేమ పెళ్ళి చేసుకుంది కియారా అద్వాని. దాదాపు ఐదారేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు...ఎప్పుడూ బయట పడలేదు. సోషల్ మీడియా కోడై కూసినా.. పట్టిచుకోలేదు. ఎవరు ఎన్ని విమర్షలు చేసినా.. కట్టుకదలు రాసినా.. స్పందించలేదు. ఇక ఎట్టకేలకు అవన్నీ ఎందుకులే అనుకున్నారో ఏమో.. పెళ్ళి బంధంతో ఓక్కట్టయ్యారు.
వీరి పెళ్ళి.. రాజస్థాన్ లో అతి కొద్ది మంది సమక్షంలో జరిగినా.. చాలా ఘనంగా జరిగింది. ఇక పెళ్ళి తరువాత కొన్నాళ్లు హనీమూన్(Honey Moon) చేసుకున్న ఈజంట.. ఆతరువాత ఎవరి షూటింగ్స్ లో వారు బిజీ అయిపోయారు. ఇక ప్రస్తుతం కీయారా అద్వాని టాలీవుడ్ లో రామ్ చరణ్(Ram Charan) జోడీగా రెండో సారి నటిస్తోంది. శంకర్(shankar) డైరెక్షన్ లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న గేమ్ చేంజర్(Game Changer) లో నటిస్తుంది కియారా. ఇక ఈసినిమాతో పాటు బాలీవుడ్ లో సత్యప్రేమ్ కీ కథా(Sathya Prem ki katha) సినిమాలో నటిచింది కియారా .ఈసినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక ఈమూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా జైపూర్‌లో హీరో కార్తిక్ ఆర్యన్(Karthik Aryan) తో కలిసి సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ఫోటోలలో కియారా బేబి బంప్‌తో(Baby Bump) ఉన్నట్లు కనిపించింది. దాంతో పలువురు నెటిజన్లు ఏదైనా శుభవార్త ఉందా కియారా జీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా నిజంగానే కియారా ప్రెగ్నెంట్ అయిందా? లేదంటే ఆమె వేసుకున్న డ్రెస్ వల్ల అలాగా కనిపించిందా అనేది తెలియాల్సి ఉంది.
ఈ విషయంలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రగ్నంట్ అయితే ఎందుకు దాచుకుంటుంది. ఆమె అభిమానులకోసం స్పందించేది కదా...? గుడ్ న్యూస్ ను అనౌన్స్ చేసేది కదా.. అయినా ప్రగ్నెంట్ అయితే.. ఇంతలా ప్రమోషన్లలో పాల్గోంటుందా అని చాలా మంది కియారాకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. మరికోందరు మాత్రం ఆమె నిజంగా తల్లి కాబోతోంది అనుకుంటా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి ఇందులో నిజం ఏంటో వారు స్పందిస్తే కాని తెలియదు.