ప్రముఖ నటి కస్తూరి తెలుగు సిరీయల్స్, పలు సినిమాల్లో నటించారు.

ప్రముఖ నటి కస్తూరి తెలుగు సిరీయల్స్, పలు సినిమాల్లో నటించారు. తెలుగు ప్రజలకందరికీ ఆమె సుపరిచితురాలే. పలు సీరియళ్లలో నటించి ఆకట్టుకున్నారు. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. అయితే తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆమె మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తమిళనాడులో స్థిరపడ్డ తెలుగువారిపై ఆమె పలు విమర్శలు చేశారు. తమిళనాడులో ఉంటున్న తెలుగువారు రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చినవారని... అలాంటి వారంతా ఇప్పుడు తమది తమిళజాతి అంటూ పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారన్నారు. 300 ఏళ్ల క్రితం ఒక రాజుల వద్ద ఉండే అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చారన్నారు. వారే తమది తమిళజాతి అంటే వందల ఏళ్ల క్రితం ఉన్న బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరు అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం తమిళనాడు మంత్రుల్లో ఐదుగురు మంత్రులు తెలుగు మాట్లాడుతారు. ఆస్తులను కొల్లగొట్టకూడదని.. ఒకరి క ంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని చెప్తున్న బ్రాహ్మణుల గురించి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారన్నారు. తెలుగువారిపై ఆమె వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. విమర్శల తీవ్రత పెరగడంతో అదే సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందిస్తూ తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారంటూ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు కస్తూరి.

ehatv

ehatv

Next Story