తమిళనాడులో(Tamilnadu) స్థిరపడిన తెలుగువారి గురించి అనరాని మాటలు అన్న నటి కస్తూరిని

తమిళనాడులో(Tamilnadu) స్థిరపడిన తెలుగువారి గురించి అనరాని మాటలు అన్న నటి కస్తూరిని(Kasturi) పోలీసులు అరెస్ట్(Arrest cheyadam) చేయడం, ఈ కేసులో ఆమెకు చెన్నై ఎగ్మోర్‌ కోర్డు(Chennai Agmor court) రిమాండ్‌(Remand) విధించడ రిమాండ్‌కు పంపించడం తెలిసిన విషయాలే! అయితే అంతకు ముందు ఆమెకు పరారయ్యారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలను అరెస్ట్‌కు ముందు కస్తూరి ఖండించారు. తాను ఎక్కడికి పారిపోలేదని చెప్పారు. 'నేను పరారీలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఇందులో వాస్తవం లేదు. నేను ఎక్కడికీ పారిపోలేదు. ఎక్కడా దాక్కోలేదు. షూటింగ్‌(Shooting) కోసం హైదరాబాద్‌కు వచ్చాను. ఇక్కడ నా ఇంట్లో ఉన్నాను. రోజూ షూటింగ్‌కు వెళ్లి వస్తున్నాను. నా సెల్‌ఫోన్‌ను లాయర్‌కు ఇచ్చాను. పోలీసులకు పూర్తిగా సహకరిస్తాను' అని కస్తూరి తెలిపారు. ఇటీవల తమిళనాడులోని హిందూ మక్కల్‌ కచ్చి ఏర్పాటు చేసిన సభలో కస్తూరి మాట్లాడుతూ ద్రవిడ పార్టీలపై విరుచుకుపడ్డారు. ద్రవిడ పార్టీలు బ్రాహ్మణులను పరాయివాళ్లుగా చూడటం సరికాదన్నారు. అదే సమయంలో తెలుగువారి పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో పలువురు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. అఖిల భారత తెలుగు సమ్మేళనం తరఫున ఎగ్మూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కోసం కస్తూరి ఇంటికి వెళ్లారు. అక్కడ ఆమె లేకపోవడంతో పరారీలో ఉన్నట్టు ప్రకటించారు. ఆమె కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వెతికారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఆమెను అరెస్ట్‌ చేశారు. చెన్నైకు తీసుకెళ్లి ఎగ్మూరు కోర్టులో హాజరుపరిచారు. ఇదిలా ఉంటే కస్తూరిని జైలులో పెట్టేంత నేరం ఆమె ఏం చేసిందని ఎన్‌టీకే ప్రధాన సమన్వయకర్త సీమాన్‌ నిలదీశారు. కస్తూరిపై పగ తీర్చుకోవాలనే జైలుకు పంపారని, ఆమె జైలుకు వెళ్లేంత నేరం ఏం చేసిందని ప్రశ్నించారు.

Eha Tv

Eha Tv

Next Story