ఖమ్మం(Khammam)లో ఏర్పాటు చేయాలనుకున్న ఎన్టీఆర్ విగ్రహంపై కరాటే కల్యాణి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆ వ్యాఖ్యల ఫలితంగానే ఆమె మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ అయ్యారు. నిజానికి ఆమె సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ చెప్పలేకపోతున్నది. సినీ పరిశ్రమలోని ఓ వర్గం నుంచి ఒత్తడి వచ్చింది కాబట్టే ఆమె సభ్యత్వాన్ని రద్దు చేశారన్నది బహిరంగ రహస్యం.
ఖమ్మం(Khammam)లో ఏర్పాటు చేయాలనుకున్న ఎన్టీఆర్ విగ్రహంపై కరాటే కల్యాణి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆ వ్యాఖ్యల ఫలితంగానే ఆమె మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ అయ్యారు. నిజానికి ఆమె సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ చెప్పలేకపోతున్నది. సినీ పరిశ్రమలోని ఓ వర్గం నుంచి ఒత్తడి వచ్చింది కాబట్టే ఆమె సభ్యత్వాన్ని రద్దు చేశారన్నది బహిరంగ రహస్యం. అదలా ఉంచితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కల్యాణి తనకు ప్రాణ హానీ ఉన్నట్టు తెలిపారు. ఈ మధ్యనే తన కారు రెండు టైర్లను గుర్తు తెలియని వ్యక్తులు కోసేశారని, ఆ విషయం తెలియకుండా తాను అదే కారులో ప్రయాణించానని కల్యాణి అన్నారు. కొంత దూరం వెళ్లిన తర్వాత కారు టైర్లు పేలిపోయాయని, అదృష్టం బాగుంది కాబట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డానని అన్నారు. అదే హైవే మీద ప్రయాణించి ఉంటే తన పరిస్థితి ఇంకోలా ఉండేదని చెప్పారు. కారు మెకానిక్ దగ్గరకు వెళితే ఎవరో ఉద్దేశపూర్వకంగానే కారు టైర్లను కోసేశారని చెప్పాడని, అతడు చెప్పిన మాట విని భయంతో వణికిపోయానని కరాటే కల్యాణి అన్నారు. కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టకూడదంటూ కల్యాణి అనడమే కాకుండా కోర్టుకెళ్లి స్టే కూడా తీసుకొచ్చారు. ఇది ఓ వర్గం వారికి కోపం తెప్పించి ఉంటుంది, ఆ కోపంతోనే కల్యాణి కారు టైర్లు కోసేసి ఉంటారని కల్యాణి ఆరోపిస్తున్నారు.