బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌(Kangana Ranaut) నటించిన చంద్రముఖి-2(Chandramukhi) సినిమా గురువారం విడుదల కాబోతున్నది. కాంట్రవర్సీలంటే ఆమెకు చాలా ఇష్టం. అందుకే తరచూ ఏదో ఒక వివాదంలో ఉంటుంటారు. వివాదాలతో సావాసం చేస్తుంటారు. గత కొన్నాళ్లుగా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌ అవుతున్న ఈ అందాల భామ ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు.2006లో బాలీవుడ్‌లో కెరీర్ మొదలుపెట్టిన కంగనా రనౌత్.. తెలుగులో ప్రభాస్‌తో కలిసి ఏక్ నిరంజన్ సినిమాలో హీరోయిన్‌గా నటించారు.

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌(Kangana Ranaut) నటించిన చంద్రముఖి-2(Chandramukhi) సినిమా గురువారం విడుదల కాబోతున్నది. కాంట్రవర్సీలంటే ఆమెకు చాలా ఇష్టం. అందుకే తరచూ ఏదో ఒక వివాదంలో ఉంటుంటారు. వివాదాలతో సావాసం చేస్తుంటారు. గత కొన్నాళ్లుగా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌ అవుతున్న ఈ అందాల భామ ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు.2006లో బాలీవుడ్‌లో కెరీర్ మొదలుపెట్టిన కంగనా రనౌత్.. తెలుగులో ప్రభాస్‌తో కలిసి ఏక్ నిరంజన్ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. అది ఆడకపోవడంతో మరో తెలుగు సినిమా చేయలేదు. తమిళంలో కూడా నటించారు . అక్కడ కూడా అదే పరిస్థితి. నటిగా హిందీలో అద్భుతమైన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు కంగనా రనౌత్‌. అమె అద్భతమైన నటి అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. హృతిక్‌తో రిలేషన్ అప్పట్లో సంచలనం సృష్టించింది. అలాగే ఖాన్ త్రయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. గత కొన్నాళ్లుగా కంగనా రనౌత్‌ సినిమాలు పెద్దగా ఆడటం లేదు. ప్రస్తుతం ఈమె 'చంద్రముఖి 2' అనే తమిళ సినిమాలో లీడ్ రోల్ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా విడుదలవుతోంది. మరోవైపు హిందీలో తేజస్(Tejas), ఎమర్జెన్సీ(emergency) అనే చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవి త్వరలో విడుదల కానున్నాయి. కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలని కంగనా అనుకుంటున్నారట! ప్రముఖ హిందీ క్రిటిక్ ఈ విషయాన్ని చెబుతూ రీసెంట్‌గా ఓ ట్వీట్ చేశాడు. ప్రముఖ బిజినెస్‌మ్యాన్‌ని(Business man) కంగన పెళ్లి చేసుకోబోతున్నారని, ఈ ఏడాది డిసెంబరులో నిశ్చితార్థం, వచ్చే ఏప్రిల్‍‌లో పెళ్లి అని రాసుకొచ్చాడు. ఆయన రాసుకొచ్చాడు సరే, కంగనా మాత్రం దీనిపై ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. మరి ఇది నిజమా కాదా అనేది ఆమెనే చెప్పాలి.

Updated On 27 Sep 2023 7:26 AM GMT
Ehatv

Ehatv

Next Story