చాలా నెలలుగా వేచి చూస్తున్న కంగనా రనౌత్(Kangana ranuth) రాజకీయ డ్రామా ఎమర్జెన్సీ(Emergency) సెన్సార్ క్లియరెన్స్ పొందింది.
చాలా నెలలుగా వేచి చూస్తున్న కంగనా రనౌత్(Kangana ranuth) రాజకీయ డ్రామా ఎమర్జెన్సీ(Emergency) సెన్సార్ క్లియరెన్స్ పొందింది. ఈ సినిమా జనవరి 17, 2025న థియేటర్లలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 1970 దశకంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. భారత ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన, ఎక్కువగా మాట్లాడే అధ్యాయం ఎమర్జెన్సీ. వాస్తవంగా ఈ చిత్రం గతేడాదిలోనే విడుదల కావాల్సి ఉంది. అయితే సెన్సార్(Censor) చిక్కుల వల్ల పలు ఇబ్బందలు రావడంతో ఈ సినిమా విడుదల పలు మార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఎమర్జెన్సీ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 17న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఓ పోస్టర్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో తమ వర్గాన్ని తక్కువ చేసి చూపించారని కొందరు సిక్కులు మధ్యప్రదేశ్ హైకోర్టుకు(Madhya Pradesh high court) వెళ్లడంతో విడుదల విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. వారి వాదనలను పరిగణనలోకి తీసుకోవాలని సీబీఎఫ్‌సీని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించడంతో మరోసారి ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఎట్టకేలకు కోర్టు నుంచి కూడా అడ్డంకులు లేకపోవడంతో 2025 జనవరి 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఎమర్జెన్సీ సినిమాపై ఆసక్తిగల వారకు జనవరి 17వరకు వేచి చూడాల్సిందే.