సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన కొత్తలో కథానాయిక వేషాలు వేశారు జయలలిత(Jayalalithaa). ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో వాంప్‌ పాత్రలకు(Vamp character) కూడా ఓకే చెప్పారు. ఐటం సాంగ్స్‌ చేశారు. ఆ సమయంలో జయలలితకు డిమాండ్‌ బాగా ఉండింది. పారితోషికం కూడా ఎక్కువగా ముట్టింది. అటు పిమ్మట జయలలిత అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించారు. ఓ దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత మోసపోయానని గ్రహించారు జయలలిత.

సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన కొత్తలో కథానాయిక వేషాలు వేశారు జయలలిత(Jayalalithaa). ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో వాంప్‌ పాత్రలకు(Vamp character) కూడా ఓకే చెప్పారు. ఐటం సాంగ్స్‌ చేశారు. ఆ సమయంలో జయలలితకు డిమాండ్‌ బాగా ఉండింది. పారితోషికం కూడా ఎక్కువగా ముట్టింది. అటు పిమ్మట జయలలిత అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించారు. ఓ దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత మోసపోయానని గ్రహించారు జయలలిత. అతడు పెట్టే హింస భరించలేక మూడు నెలలకు అతడి నుంచి వేరుపడ్డారు. అప్పట్నుంచి ఒంటరిగానే జీవిస్తున్నారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సంచలన నిజాలు చెప్పారు. దివంగత నటుడు శరత్‌బాబును(Sarath Babu) తాను మనసారా ప్రేమించానని చెప్పారు. 'నేను శరత్‌బాబును గాఢంగా ప్రేమించాను. కానీ ఈ విషయం ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదు. ఆయనతో కలిసి ఉండాలని అనుకున్నాను. ఆయనకు ఈ విషయం చెప్పాను. ఏ విషయాన్ని అయినా అనేక రకాలుగా ఆలోచించే శరత్‌బాబు ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేకపోయారు. ఎక్కువ శ్రద్ధ కూడా పెట్టలేదు. కాకపోతే ఆయనతో కలిసి అనేక తీర్థయాత్రలు చేశాను. ఆ భగవంతుడే తనకు ఓ గైడ్‌ పంపంచాడని అనుకున్నాను. శరత్‌బాబు చాలా మంచి వ్యక్తి. మేము పెళ్లి(Marriage) కూడా చేసుకోవాలనుకున్నాం. ఓ బాబునో, పాపనో కందామని కూడా అనుకున్నాం. అందుకు ప్రణాళికలు వేసుకున్నాం. కానీ మా పెళ్లిని ఇండస్ట్రీకి చెందిన వారే అపారు. ఆ పెళ్లి జరగకుండా చేశారు' అని జయలలిత తెలిపారు. మనిద్దరం కలిసి బిడ్డను కందాం అని చెప్పినప్పుడు శరత్‌బాబు వెంటనే నిర్ణయం తీసుకోలేకపోయాడని అన్నారు. 'బిడ్డ పుట్టిన తర్వాత మనిద్దరం చనిపోయాక ఆస్తి గురించి బిడ్డను ఏమైనా హింసిస్తారేమో' అని శరత్‌బాబు భయపడేవారు. మా మధ్య ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. శరత్‌బాబు భార్య రమాదేవి నాకు చాలా క్లోజ్‌. ఆమెను అక్కా అని పిలుస్తాను. శరత్‌బాబును బావ అని పిలిచేదాన్ని. బావ బావ అంటూ నేను తనకు క్లోజ్‌ అయ్యాను. తన దగ్గర కూర్చుంటే సమయమే తెలిసేది కాదు. నేను ఆడదాన్ని అన్న అభ్యంతరం లేకపోతే మీరు యాత్రలకు వెళ్లేటప్పుడు తీసుకెళ్లండి అని చెప్పాను. అలా తనతో నా జర్నీ మొదలైంది. ఆయనకు సేవ చేసుకుంటూ ఉండిపోవాలనుకున్నాను. కానీ దేవుడు ఆయనను పట్టుకెళ్లిపోయాడు' అని ఆవేదనతో కూడిన స్వరంతో అన్నారు జయలలిత. ఇండస్ట్రీలో జరిగిన అవమానల గురించి కూడా ఆమె నిర్మోహమాటంగా చెప్పారు 'ఇండస్ట్రీలో గ్లామర్‌ పాత్రలు ఎక్కువ వేయడంతో కొందరు ఆర్టిస్టులు వెంటపడేవారు.. కానీ ప్రతిసారి తప్పించుకోలేకపోయేదాన్ని. కొన్ని తప్పించుకున్నాను. మరికొన్నిసార్లు తప్పించుకోలేకపోయాను. తప్పదన్నట్టుగా లొంగిపోయాను. ఆ సమయంలో ఎవరూ ప్రేమ చూపించేవారు కాదు. అలాగని పైశాచికంగానూ ప్రవర్తించేవారు కాదు. అవసరం తీర్చుకుని వెళ్లిపోయేవారు' అని జయలలిత చెప్పుకొచ్చారు.

Updated On 9 March 2024 2:52 AM GMT
Ehatv

Ehatv

Next Story