తమిళ నటి హిందుజా(Actress Indhuja) ఇప్పుడిప్పుడే పరిశ్రమలో నిలదొక్కుకుంటోంది. హీరోయిన్ పాత్రలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆమెకు నటన అంటే ఎంతో ఇష్టం. నటన అంటే పాషన్. నటనంటే అదో రకమైన కిక్.. ఈ మాట ఆమెనే చెప్పింది. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కిక్ ఉంటుందని, అలా తనకు నటించడంలోనే కిక్ కలుగుతుందని తెలిపింది.
తమిళ నటి ఇందుజా (Actress Indhuja) ఇప్పుడిప్పుడే పరిశ్రమలో నిలదొక్కుకుంటోంది. హీరోయిన్ పాత్రలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆమెకు నటన అంటే ఎంతో ఇష్టం. నటన అంటే పాషన్. నటనంటే అదో రకమైన కిక్.. ఈ మాట ఆమెనే చెప్పింది. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కిక్ ఉంటుందని, అలా తనకు నటించడంలోనే కిక్ కలుగుతుందని తెలిపింది. సినిమాలో నటిస్తున్నప్పడు తాను ఇందుజా అని అనుకోనని, పాత్ర స్వభావాన్ని బట్టి మారడం తనకు కిక్ ఇస్తుందని చెప్పింది. మేయాదమాన్ అనే సినిమాతో నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హిందుజా తర్వాత బిల్లా పిండి, మహాముని, ముకుత్తి అమ్మన్, నానే వరువేన్ తదితర సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పార్కింగ్ అనే సినిమాలో హరీష్ కల్యాణ్ సరసన నటిస్తోంది. పార్కింగ్ సినిమాలో తాను అధ్యాపకురాలిగా నటిస్తున్నానని ఇందుజా తెలిపింది. పార్కింగ్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి? తద్వారా జరిగే పరిణామాలు ఏమిటి? వంటి అంశాలతో పాటు పలు ఆసక్తికరమైన ఘటనలు ఈ సినిమాలో ఉంటాయని చెప్పింది. ఇందులో కొన్ని ఛాలెంజింగ్‌తో కూడిన సన్నివేశాలలో నటించానని ఇందుజా తెలిపింది. కథానాయికగా నటించాలనే లక్ష్యంతోనే తాను సినిమా పరిశ్రమలోకి వచ్చానని, అయితే మొదట్లో కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారని ఇందుజా తెలిపింది. అలాగని వరుసగా అలాంటి పాత్రల్లోనే నటిస్తే క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ముద్ర వేస్తారని అనుకుని ఇప్పుడు హీరోయిన్ పాత్రలకే ప్రాముఖ్యతనిస్తున్నానని పేర్కొంది. తాను తమిళ అమ్మాయినని చెప్పినప్పుడు మొదట్లో పలువురు హేళనగా చూశారని, ఎందుకు అలా చూస్తున్నారో అప్పుడు అర్థం కాలేదని, అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని తెలిపింది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ రావడంతో ప్రేక్షకులు అన్ని చిత్రాలనూ చూస్తున్నారని తెలిపింది. కథా పాత్రలను అర్థం చేసుకుని నటించడానికి మాతృభాష చాలా అవసరం అవుతోందని దర్శకులు భావిస్తున్నారని చెప్పింది. హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంలో నటించే అవకాశం వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనని హిందుజా తెలిపింది.