సీనియర్ హీరోయిన్ ఇంద్రజ(Indhraja) ఎప్పుడూ క్లాస్ గా కనిపిస్తారు.. అటువంటిది ఆమె మాస్ స్టెప్పులు ఏస్తే ఎలాంటుందో తెలుసా.. ఇగో తాజాగా మాస్ స్టెప్పులతో హడావిడి చేసింది సీనియర్ స్టార్.. దరసా సాంగ్ కు అదరిపోయే స్టెప్పులేసింది.

సీనియర్ హీరోయిన్ ఇంద్రజ(Indhraja) ఎప్పుడూ క్లాస్ గా కనిపిస్తారు.. అటువంటిది ఆమె మాస్ స్టెప్పులు ఏస్తే ఎలాంటుందో తెలుసా.. ఇగో తాజాగా మాస్ స్టెప్పులతో హడావిడి చేసింది సీనియర్ స్టార్.. దరసా సాంగ్ కు అదరిపోయే స్టెప్పులేసింది.

రీసెంట్ గా దసరా(dasara) మూవీలో కీర్తి సురేష్(keerthy suresh) మాస్ స్టెప్పులకు మాంచి పాపులాలరిటీ వచ్చింది. ఆమె వేసిన మాస్ డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి.. వాటని రీల్స్ గా చేస్తున్నారు అందరూ. సాధారణ ప్రేక్షకుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ ఈ డాన్స్ ను ఇమిటేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలో సీనియర్ హీరోయిన్ ఇంద్రజ కూడా కీర్తి సురేష్ స్టెప్పులను మించి అదరిపోయే డాన్స్ ను చేసి ఆశ్చర్యపరిచింది

90స్ లో తెలుగు తెరను ఒక ఊపు ఊపేశారు..హీరోయిన్ గా ఎంత స్టార్ డమ్ సాధించిందో.. సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ కూడా ప్రేక్షకుల మనసును దోచేస్తోంది. ప్రస్తుతం సినిమాల్లో తల్లి క్యారెక్టర్లు చేస్తూ.. బిజీగా ఉంది. ఇక సినిమాలతో పాటుగా బుల్లితెర స్టార్ షో అయిన జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీకి ప్రోగ్రామ్స్ కు జడ్జీగా ఫిక్స్ అయిపోయింది ఇంద్రజ. రోజా మానేసినప్పటి నుంచి ఇద్రజనే ఈ షోకి పెద్ద దిక్క అయ్యారు.

ఇక ఈషోలో రోజాను మరిపిస్తూ... తనదైన పంచులతో మాటలతో అలరిస్తోంది ఇంద్రజ. తన నవ్వుతో..అమాయకత్వంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇక తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీకి చెందిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రోమోలో ఇంద్రజ దసరా మూవీలోని కీర్తి సురేష్ డ్యాన్స్ చేసిన పెళ్లి బరాత్ స్టెప్పులతో రచ్చ రచ్చ చేసింది. ఎప్పుడూ క్లాస్ గా కనిపించే ఇంద్రజ.. మాస్ బీట్ కు ఊరమాస్ స్టెప్పులువేస్తూ.. అదరగొట్టింది. ఇంద్రజ.. కీర్తి సురేష్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా డ్యాన్స్ తో స్టేజ్ మెుత్తాన్ని ఓ ఊపు ఊపింది ఇంద్రజ. అచ్చం పెళ్లి కూతురి చీరకట్టుతో తీన్ మార్ బీట్ కు మాస్ స్టెప్పులు వేసింది. హుషారైన స్టెప్పులతో అలరించింది. ప్రస్తుతం ఇంద్రజ వేసిన ఈ డ్యాన్స్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Updated On 21 April 2023 12:01 AM GMT
Ehatv

Ehatv

Next Story