అందాన్ని మెరుగుపర్చుకోవడం కోసం, మరింత అందంగా కనిపించడం కోసం కొందరు హీరోయిన్లు సర్జరీ చేయించుకుంటారు. ఒకప్పటి శ్రీదేవి(Sridevi) నుంచి మొదలు పెడితే ఈ చిట్టా పెద్దగానే ఉంటుంది. తాజాగా హీరోయిన్‌ హనీరోజ్‌(Honeyrose) కూడా శస్త్రచికిత్స ద్వారా మరింత అందంగా ఉండేందుకు ప్రయత్నిస్తుందనే ప్రచారం సోషల్ మీడియాలో వెల్లువెత్తుతోంది.

అందాన్ని మెరుగుపర్చుకోవడం కోసం, మరింత అందంగా కనిపించడం కోసం కొందరు హీరోయిన్లు సర్జరీ చేయించుకుంటారు. ఒకప్పటి శ్రీదేవి(Sridevi) నుంచి మొదలు పెడితే ఈ చిట్టా పెద్దగానే ఉంటుంది. తాజాగా హీరోయిన్‌ హనీరోజ్‌(Honeyrose) కూడా శస్త్రచికిత్స ద్వారా మరింత అందంగా ఉండేందుకు ప్రయత్నిస్తుందనే ప్రచారం సోషల్ మీడియాలో వెల్లువెత్తుతోంది. కేరళకు చెందిన హనీరోజ్‌ 14 వయదిల్‌ బాయ్‌ఫ్రెండ్‌(14 Vayadil boyfriend) అనే మలయాళ చిత్రంతో హీరోయిన్‌ అయ్యింది. సుమారు రెండు దశాబ్దాలుగా సినిమాల్లో నటిస్తూ వస్తోంది. కనవే, సింగం పులి, మల్లుకట్టు, గాంధర్వన్‌ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికీ హీరోయిన్‌గా కొనసాగుతున్న హనీరోజ్‌ ఇటీవల బాలకృష్ణ(Balakrishna) నటించిన వీరసింహారెడ్డిలో(Veera Simha Reddy) ప్రధాన పాత్రను పోషించింది. అలా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 33 లక్షల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం. తన అందం గురించి జరుగుతున్న ట్రోలింగ్‌పై ఈ అందాలభామ స్పందించింది. హీరోయిన్‌గా గ్లామర్ రంగంలో అందాన్ని కాపాడుకోవడం అనివార్యమని ఆమె తెలిపింది. అందంగా కనిపించడానికి తాను సౌందర్య సాధనాలు వాడుతుంటానని చెప్పింది. కొందరు ప్రచార చేస్తున్నట్టు శస్త్రచికిత్స మాత్రం చేయించుకోలేదని తేల్చేసింది. నటిగా కొనసాగడం సాధారణ విషయం కాదని, తన అందం అనేది భగవంతుడు ఇచ్చిన వరమని తెలిపింది హనీరోజ్‌.

Updated On 26 July 2023 4:33 AM GMT
Ehatv

Ehatv

Next Story