హిందీ టీవీ నటి హీనా ఖాన్ దిగ్భ్రాంతి కలిగించే వార్త చెప్పారు. తాను బ్రెస్ట్ కేన్సర్‌తో బాధపడుతున్నానని, ప్రస్తుతం ఆ వ్యాధి మూడో దశలో ఉందని తెలిపారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు.
హిందీ టీవీ నటి హీనా ఖాన్(Hina Khan) దిగ్భ్రాంతి కలిగించే వార్త చెప్పారు. తాను బ్రెస్ట్ కేన్సర్(Breast Cancer)తో బాధపడుతున్నానని, ప్రస్తుతం ఆ వ్యాధి మూడో దశలో ఉందని తెలిపారు. ఇన్స్టాగ్రామ్(Instagram) ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. అందులో ఆమె ఏం రాసుకొచ్చారంటే 'అందరికీ హలో.. నన్ను ప్రేమించే, నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. నేను స్టేజ్ త్రీ బెస్ట్ కేన్సర్‌తో బాధపడుతున్నాను. ఇది సవాల్‌తో కూడుకున్న సమయమని తెలుసు. అయినా నేను మానసికంగా చాలా బలంగా ఉన్నా. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నా. ఇందులోంచి త్వరగా బయటపడతానన్న నమ్మకం బలంగా ఉంది. ఇలాంటి సంక్లిష్ట సమయంలో నాపై గౌరవం ఉంచి నా గోప్యతకు భంగం కలిగించవద్దని వేడుకుంటున్నా. దేవుడి దయ, కుటుంబసభ్యుల ఆశీస్సులతో నేను పూర్తి ఆరోగ్యంగా ఉంటానని నమ్ముతున్నా' అని హీనా ఖాన్ రాసుకొచ్చారు. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. పలురువు సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా హీరాఖాన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. యే రిష్తా క్యా కెహ్లాతా హై సీరియల్‌తో హీనా ఖాన్ గుర్తింపు తెచ్చుకుంది. కసౌటి జిందగీ కే, నాగిన్ (5వ సీజన్) సీరియల్స్‌లో ముఖ్యపాత్రలు వేసింది. హిందీ బిగ్‌బాస్‌లోనూ పాల్గొంది. ఖత్రోంకీ ఖిలాడీ సీజన్ 8 రియాల్టీ షోలో నటించింది. ప్రస్తుతం ఆమె నామాకూల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.