నటి హేమ(hema) మరో వీడియో విడుదల చేసింది.
నటి హేమ(hema) మరో వీడియో విడుదల చేసింది. బెంగళూరు రేవ్ పార్టీ(rave Party) కేసులో మీడియాకే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. తాను డ్రగ్స్ తీసుకున్నానని ప్రచారం చేస్తున్నారని, మీ దగ్గరకే వస్తానని కావాలంటే టెస్ట్‌లు చేయించండి అంటూ మీడియాను నిలదీశారు. హేమకు పరీక్షలో పాజిటివ్‌కు వచ్చిందని పదే పదే మీడియా ప్రసారం చేస్తున్నదని, కావాలంటే టెస్టులు చేయించుకోవడానికి సిద్ధమన్నారు. ఆరు నిమిషాల ఆ వీడియోలో హేమ తన ఆవేదన తెలుపుకున్నారు. ఎన్టీవీ అధినేత నరేన్ చౌదరి, ఆర్‌టీ అధినేత రవిప్రకాశ్, ఏబీఎన్ రాధాకృష్ణ(Radhakrishna), బీఆర్ నాయుడులకు ఆమె విజ్ఞప్తి చేశారు. తన గురించి మీకు తెలియదా? మీ ఇంట్లో పార్టీలకు హాజరు కాలేదా? అని హేమ అడిగారు. మీ ఛానెళ్ల దగ్గరకే తాను వస్తానని , మీరే వైద్య పరీక్షలు జరపండి అంటూ విన్నవించుకున్నారు హేమ. 'గతంలో నాకు పాజిటివ్ వచ్చిందని మీడియా వాళ్లు ఏదైతే ప్రచారం చేశారో.. అదే పాత న్యూస్‌ని తీసుకొచ్చి మళ్లీ మళ్లీ ప్రసారం చేస్తున్నారు. ఛార్జీషీట్ ఇంకా నేనే చూడలేదు. నా చేతికే రాలేదు. అలాంటిది మీ చేతికి ఎలా వచ్చింది? మీరు ఇలాంటి న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. నేను మీ దగ్గరికే వస్తాను. టెస్టులు చేయించండి. ఒకవేళ పాజిటివ్ వస్తే ఏ శిక్ష వేసినా భరిస్తాను. ఆ శిక్షని అనుభవిస్తాను. నెగిటివ్ వస్తే మీ పెద్దలందరూ కలిసి ఏం చేస్తారో మీరే నిర్ణయం తీసుకోండి అని హేమ అన్నారు. 'ఈ న్యూస్ వల్ల మా అమ్మకి యాంగ్జైటీ వచ్చింది. నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించాం. అలానే పరువు కోసం నేను చచ్చిపోతా. నా కుటుంబం తలదించుకునే పని ఈ రోజు వరకు చేయలేదు. ఇండస్ట్రీ నా వల్ల తలదించుకునే పని ఏ రోజు చేయలేదు. ఏ రోజు కూడా చేయను. గతంలో చేయలేదు. భవిష్యత్తులో చేయను కూడా. ఎక్కడికి రమ్మన్నా వస్తాను నేను రెడీ. నాకు టెస్టులు చేయించండి' అంటూ హేమ ఆ వీడియోలో చెప్పుకున్నారు. చేతులు జోడించి మరీ రిక్వెస్ట్ చేశారు.