సినీ నటి హేమ అరెస్టుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో

సినీ నటి హేమ అరెస్టుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తానేమీ తప్పు చేయలేదని, తన మీద తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారంటూ హేమ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు డ్రగ్స్‌ కేసులో నటి హేమను విచారించేందుకు బెంగళూరు సీసీబీ పోలీసులకు అనుమతి లభించింది. బెంగళూరు నగర శివార్లలో ఇటీవల జరిగిన రేవ్‌పార్టీలో హేమ మాదక ద్రవ్యాలను తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఆమె రక్తనమూనాలను సేకరించి వైద్య పరీక్షకు పంపించగా మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు రిపోర్ట్‌ వచ్చింది. హేమను విచారించేందుకు మూడురోజుల కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోర్టును కోరారు. అయితే, న్యాయస్థానం మాత్రం 24 గంటల పాటు ఆమెను విచారిస్తే చాలని తెలిపింది.

ఇక ఈ ఘటన తర్వాత హేమకు సినిమా అవకాశాలు వస్తాయా.. రావా అనే అనుమానాలు ఉన్నాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నుంచి హేమను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్లు పెరగడంతో ఈ ఘటన సినీ పరిశ్రమలో చర్చకు దారితీసింది. నటి కరాటే కళ్యాణి ముఖ్యంగా హేమపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఈ డిమాండ్లపై స్పందించిన MAA అధ్యక్షుడు మంచు విష్ణు హేమ సస్పెన్షన్ అంశాన్ని పరిశీలించినట్లు సమాచారం. ఈ విషయానికి సంబంధించి సభ్యుల నుండి అభిప్రాయాలను కోరుతూ అతను అసోసియేషన్‌లో పోల్ నిర్వహించారు. మెజారిటీ సభ్యులు సస్పెన్షన్‌కు మొగ్గు చూపడంతో, త్వరలో హేమ సస్పెన్షన్‌ను విష్ణు ప్రకటించే అవకాశం ఉంది.

Updated On 6 Jun 2024 12:35 AM GMT
Yagnik

Yagnik

Next Story