దక్షిణాది ప్రముఖ నటి హేమా చౌదరి(Hema Choudhary) ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. బ్రెయిన్ హెమరేజ్ కారణంగా బెంగళూరులోని(Bengaluru) ఓ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె చికిత్సకు స్పందించడం లేదని వైద్యులు తెలిపారు. విదేశాలలో ఉన్న ఆమె కుమారుడు ఆగమేఘాల మీద వస్తున్నాడు. హేమా చౌదరి ఎక్కువగా కన్నడ(Kannada) సినిమాల్లోనే నటించినప్పటికీ తెలుగు, తమిళ, మలయాళ(Malayalam) సినిమాల్లో కూడా నటించి మెప్పించారు.
దక్షిణాది ప్రముఖ నటి హేమా చౌదరి(Hema Choudhary) ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. బ్రెయిన్ హెమరేజ్ కారణంగా బెంగళూరులోని(Bengaluru) ఓ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె చికిత్సకు స్పందించడం లేదని వైద్యులు తెలిపారు. విదేశాలలో ఉన్న ఆమె కుమారుడు ఆగమేఘాల మీద వస్తున్నాడు. హేమా చౌదరి ఎక్కువగా కన్నడ(Kannada) సినిమాల్లోనే నటించినప్పటికీ తెలుగు, తమిళ, మలయాళ(Malayalam) సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. కన్నడలో రాజ్‌కుమార్(Rajkumar), విష్ణువర్ధన్, అంబరీష్, అనంత్‌నాగ్, శంకర్‌నాగ్, రవిచంద్రన్ వంటి ప్రముఖ నటులతో కలిసి నటించారు. మలయాళంలో ప్రేమ్‌నజీర్ సరసన, తమిళంలో కమల్ హాసన్‌తో(Kamal hasan), తెలుగులో చిరంజీవి(Chiranjeevi), మోహన్‌బాబు తదితరులతో కూడా నటించారు. కె.బాలచందర్, డి.యోగానంద్, పి.సాంబశివరావు, దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు(K Raghavendra rao), సంగీతం శ్రీనివాసరావు, కోడి రామకృష్ణ, కె.శంకర్ లాంటి గొప్ప దర్శకుల చిత్రాల్లో హేమా చౌదరి నటించారు. పుట్టింటికి రా చెల్లి, గోరింటాకు, సుందరకాండ,మేస్త్రీ, ప్రేమాలయం వంటి చిత్రాల్లో ఆమె నటించించారు. కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు ఎంపిక కమిటీ సభ్యురాలిగా కూడా ఉన్నారు. సువర్ణ రత్న అవార్డు, సువర్ణ పరివార్ పాపులర్ స్టార్ సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు.