సినీ నటి గౌతమి(Gauthami) తన పర్సనల్ లైఫ్‌ను, ప్రొఫెషనల్ లైఫ్‌ను సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయింది. అందుకే జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. సినీ కెరీర్ పీక్‌లో ఉన్న టైమ్‌లోనే బిజినెస్‌మన్ సందీప్ భాటియాను(Sandeep bhatia) పెళ్లి చేసుకుంది. ఇక్కడే పెద్ద పొరపాటు చేసింది. వీరికి ఓ కూతురు. కూతురు పుట్టిన ఏడాదికే సందీప్‌కు విడాకులు ఇచ్చేసింది గౌతమి. కూతురు సుబ్బలక్ష్మిని అల్లారుముద్దుగా పెంచుకుంది. ఇలా జీవితాన్ని కొనసాగిస్తే బాగుండేది కానీ ఓ బలహీనక్షణాన కమలహాసన్(Kamal Haasan) ప్రేమలో పడింది.
సినీ నటి గౌతమి(Gauthami) తన పర్సనల్ లైఫ్‌ను, ప్రొఫెషనల్ లైఫ్‌ను సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయింది. అందుకే జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. సినీ కెరీర్ పీక్‌లో ఉన్న టైమ్‌లోనే బిజినెస్‌మన్ సందీప్ భాటియాను(Sandeep bhatia) పెళ్లి చేసుకుంది. ఇక్కడే పెద్ద పొరపాటు చేసింది. వీరికి ఓ కూతురు. కూతురు పుట్టిన ఏడాదికే సందీప్‌కు విడాకులు ఇచ్చేసింది గౌతమి. కూతురు సుబ్బలక్ష్మిని అల్లారుముద్దుగా పెంచుకుంది. ఇలా జీవితాన్ని కొనసాగిస్తే బాగుండేది కానీ ఓ బలహీనక్షణాన కమలహాసన్(Kamal Haasan) ప్రేమలో పడింది. పెళ్లి చేసుకోలేదు కానీ సహజీవనం చేశారిద్దరు. 2016లో విడిపోయారు. లేటెస్ట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గౌతమి రిలేషన్‌షిప్‌పై(Relationship) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'ప్రతి ఒక్కరిని ఏదో ఒక అంశం ఇన్‌స్పైర్ చేస్తుంటుంది. మనసుబాగోలేనప్పుడు నచ్చిన వ్యక్తి వీడియోలు చూస్తుంటాం. లేదా మనలో ధైర్యాన్ని నింపే వ్యక్తి మాటలను వింటుంటాం! ఒక్కొక్కరు ఒక్కో దారిలో పయనిస్తుంటారు. దానికి ఆకర్షితులవుతాం. మన బలం మనమే. నిజమైన బలం అదే. నాకు నేను, నీకు నువ్వే అసలైన బలం. ఒక రిలేషన్‌షిప్ ఫెయిలయ్యిదంటే దానికి పూర్తి బాధ్యత మనదేనని మన నెత్తిన వేసుకోవాల్సిన పని లేదు. అది ఏ రిలేషన్‌షిప్ అయినా సరే. ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక కేంద్రబిందువు ఉంటుంది. ఇద్దరు సమానంగా అక్కడికి చేరుకోవాలి. కొన్ని కారణాల వల్ల కొందరు ఆ బిందువుకు దూరంగా ఉంటారు. పైగా మనకోసం చాలా దూరం వచ్చినట్టు భావిస్తారు. ఇలా ఒక్కసారి మోసం చేశారంటే మళ్లీ మళ్లీ మోసగిస్తూనే ఉంటారు. వారికి ఇది అలవాటుగా మారిపోతుంది. లవ్, కమిట్‌మెంట్ అనేది రెండువైపులా సమానంగా ఉండాలి. అప్పుడే ఆ బంధం ఎక్కువకాలం నిలుస్తుంది' అని గౌతమి వివరంగా చెప్పుకొచ్చింది. కమలహాసన్‌తో అపూర్ సహోదరగళ్, దేవర్‌మగన్, పాపనాశం వంటి సినిమాలలో నటించింది.