కొంతమంది నటులు, నటీమణులను 'వన్-హిట్ వండర్స్' అని పిలుస్తారు.

కొంతమంది నటులు, నటీమణులను 'వన్-హిట్ వండర్స్' అని పిలుస్తారు. ఎందుకంటే వారు ఒక సినిమాలో మాత్రమే కనిపిస్తారు. ఆ చిత్రంతోనే పాపులర్‌ అవుతారు. అలాంటి నటి గిరిజా షెట్టర్(Girija shettar). నాగార్జున(Nagarjuna) నటించిన లవ్ స్టోరీ గీతాంజలి(Geethanjali) అనే క్లాసిక్ చిత్రంలో ఆమె నటించింది. గీతాంజలిలో తన చిలిపి పాత్రతో గిరిజ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఆమె వ్యక్తిగత కారణాల వల్ల లండన్‌కు(London) తిరిగి వెళ్లవలసి వచ్చింది. గిరిజా షెట్టర్, అమీర్ ఖాన్‌తో(Ameer khan) కలిసి నటించిన మన్సూర్ ఖాన్ జో జీతా వోహీ సికిందర్ షూటింగ్ మధ్యలో వదిలి వెళ్ళవలసి వచ్చింది. చివరికి, షెట్టర్ పోషించాల్సిన అంజలి పాత్రను ఆయేషా జుల్కా పోషించింది. ఓ సారి షెట్టర్ మాట్లాడుతూ తాను భారతీయ చిత్రాలను కూడా చాలా కాలం పాటు చూడటం మానేశాను. తాను ఎదుగుతున్నప్పుడు సినిమాలు తన ప్రపంచంపై ఎంతగానో ప్రభావం చూపాయన్నారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత శెట్టర్ ఇప్పుడు మళ్లీ నటించారు. రక్షితాశెట్టి పరమవా స్టూడియోస్ నిర్మించిన, చంద్రజిత్ బెల్లియప్ప దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం 'ఇబ్బని తబ్బిద ల్లెయాలి'లో(Ibbani thabbida lleyali) సింగిల్‌ పేరెంట్‌గా నటించింది. తాను ఈ అవకాశం కోసం చూడలేదని.. ముందస్తు ప్లానంటూ ఏదీ లేదని గిరిజా షెట్టర్‌ అన్నారు.

Eha Tv

Eha Tv

Next Story