తమిళ నటి గాయత్రీ శంకర్(Gayatri Shankar) దక్షిణాది భాషల సినిమాల్లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లాస్టియర్ మామనితమ్(Mamanitam), విక్రమ్(vikram) సినిమాల ద్వారా తనదైన నటనతో మెప్పించారు. 2012లో 18 వయసు(Vayasu) అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన గాయత్రి తర్వాత నడువుల కొంజం పక్కత కానోమ్ అనే సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఆ మధ్య వచ్చిన నన్ తాన్ కేసు(Nan Than Case) కూడు సినిమాతో తెలుగువారికి కూడా దగ్గరయ్యారు.

Actress Gayathrie shankar
తమిళ నటి గాయత్రీ శంకర్(Gayatri Shankar) దక్షిణాది భాషల సినిమాల్లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లాస్టియర్ మామనితమ్(Mamanitam), విక్రమ్(vikram) సినిమాల ద్వారా తనదైన నటనతో మెప్పించారు. 2012లో 18 వయసు(Vayasu) అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన గాయత్రి తర్వాత నడువుల కొంజం పక్కత కానోమ్ అనే సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఆ మధ్య వచ్చిన నన్ తాన్ కేసు(Nan Than Case) కూడు సినిమాతో తెలుగువారికి కూడా దగ్గరయ్యారు. ఇటీవల ఈ హీరోయిన్‌పై సోషల్ మీడియాలో బోల్డంత డిస్కషన్ జరుగుతోంది. ఇందుకు కారణం ప్రముఖ స్టాండప్ కమెడియన్(Standup Comedian) అరవింద్‌తో(Arvindh) డేటింగ్‌లో(dating) ఉన్నారంటూ వదంతులు వినిపిస్తుండటమే! ఇటీవల గాయత్రి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన ఫోటోను చూస్తే అవుననే అనిపిస్తోంది. ఆ ఫోటోలో అరవింద్‌ను గాయత్రి కౌగలించుకుంటూ కనిపించారు. అంతే కాకుండా ఆ ఫోటోతో పాటు క్యాప్షన్ కూడా ఇచ్చారు గాయత్రి. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ జంట డేటింగ్‌లో ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే దీనిపై వీరిద్దరు ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. ఇన్‌స్టాలో ఆమె కమెడియన్‌గా ఆయన ఎదుగుదలను గాయత్రి ప్రశంసించారు. ఆయన పట్ల తన గర్వాన్ని వ్యక్తం చేశారు. 'రైల్వే రిజర్వేషన్ సిస్టమ్‌లో అవకతవకలు జరుగుతున్నాయని మీరు మాట్లాడటం నుంచి ఇంత దూరం ప్రయాణించారు. మీతో మాట్లాడుతున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను' అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు గాయత్రి శంకర్. అరవింద్ అసలు పేరు అరవింద్ సుబ్రహ్మణ్యం. అందరూ ఆయనను అరవింద్ ఎస్‌ఏ అని పిలుస్తారు. 2013లో వచ్చిన ఆరంభం అనే తమిళ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. అలా ఆయన కెరీర్ మొదలయ్యింది. ఆ తర్వాత 2017లో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన అత్యంత ఇష్టపడే వ్యక్తులలో ఒకరిగా నిలిచాడు. యూ ట్యూబ్‌లో కామెడీ వీడియోలు, హిందీ పాటలతో ప్రేక్షకాదరణ పొందారు. అరవిం్ మద్రాసీ డా లాంటి షోలోల కూడా కనపించారు. ఆ తర్వాత 2020లో అమెజాన్ ప్రైమ్‌లో ఐ వాజ్ నాట్ రెడీ డా షోను విడుదల చేశారు. ప్రస్తుతం ఇండియాతో పాటు కెనడా, అమెరికా, యూరప్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలలో వీ నీడ్ టూ టాక్ అనే కామెడీ షోను ప్రదర్శిస్తున్నారు.
