బాలీవుడ్ నటి ఆలియా భట్(Alia bhatt) ప్రధానపాత్రలో నటించిన జిగ్రా(Jigra) సినిమా దసరా కానుకగా ఈ నెల 11వ తేదీన విడుదలయ్యింది.
బాలీవుడ్ నటి ఆలియా భట్(Alia bhatt) ప్రధానపాత్రలో నటించిన జిగ్రా(Jigra) సినిమా దసరా కానుకగా ఈ నెల 11వ తేదీన విడుదలయ్యింది. వేదాంగ్ రైనా(Vedhang raina) ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ స్పందన వచ్చింది. అదే రోజున విక్కీ కౌశల్(Vickey koushal), తృప్తి నటించిన విక్కీ విద్య కా వో వాలా వీడియో(Vickey vidhya ka voh valla video) సినిమా వచ్చింది. ఈ రెండు సినిమా మధ్య గట్టి పోటీ ఏర్పడింది. రెండింటిలో జిగ్రా సినిమానే దూసుకుపోతున్నదని సోషల్ మీడియాలో తెగ పోస్టులు కనిపిస్తున్నాయి. సినిమా అద్భుతమంటూ రాస్తున్నారు. అయితే ప్రముఖ నిర్మాత భూషణ్‌కుమార్ భార్య, నటి దివ్య ఖోస్లా కుమార్ డిఫరెంట్‌గా రియాక్టయ్యింది. 'జిగ్రా సినిమా చూద్దామని పీవీఆర్ మాల్‌కు వెళ్లాను. థియేటర్ అతా ఖాళీ.. ప్రతి చోటా ఇదే పరిస్థితి. అయినా ఆలియా భట్ ధైర్యానికి మెచ్చుకోవాలి. థియేటర్లలోని అన్ని టికెట్లు తనే కొనేసినందుకు లేదా ఫేక్ కలెక్షన్లను ప్రకటించినందుకు..!పెయిడ్ మీడియా ఎందుకు గమ్మున ఉన్నదో తెలియడం లేదు' అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. థియేటర్‌లో సీట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్న ఓ ఫోటోను కూడా జత చేశారు. ఏది ఏమైనా మనం ప్రేక్షకులను ఫూల్ చేయకూడదు అంటూ దసరా శుభాకాంక్షలు చెప్పారు. ఆలియాపై దివ్య ఖోస్లాకు ఎందుకంత కోసం? పనిగట్టుకుని ప్రచారం చేయడంలో ఉద్దేశం ఏమిటి? అంటే జిగ్రా సినిమా దివ్య ఖోస్లా నటించిన సవి సినిమాను పోలి ఉండటమే. సవి సినిమాను ఆలియా కాపీ కొట్టిందని జనం చెప్పుకుంటున్నారు కూడా ! జిగ్రా రిలీజైన రోజునే విక్కీ విద్యా కో వో వాలా వీడియో సినిమా కూడా విడుదలయ్యింది. ఈ సినిమాను టీ-సిరీస్ అధినేత భూషణ్‌కుమార్ నిర్మించారు. దివ్య కోపానికి ఇది కూడా ఓ కారణం కావొచ్చు.