ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి ఇంట్రడక్షన్‌ అవసరం లేదు.. ఎందుకంటే ఆయన తెలుగునాట వెరీ పాపులర్‌.. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ చాలా ఫేమస్‌ అయ్యారు. గతంలో పలువురు హీరోయిన్లతో పూజలు చేయించారు. రష్మిక, నిధి అగర్వాలతో పూజలు చేయిస్తున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి కూడా! ఇప్పుడు ఈ లిస్టులో మరో హీరోయిన్‌ చేరారు. ఆమెనే డింపుల్‌ హయాతి.

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి ఇంట్రడక్షన్‌ అవసరం లేదు.. ఎందుకంటే ఆయన తెలుగునాట వెరీ పాపులర్‌.. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ చాలా ఫేమస్‌ అయ్యారు. గతంలో పలువురు హీరోయిన్లతో పూజలు చేయించారు. రష్మిక, నిధి అగర్వాలతో పూజలు చేయిస్తున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి కూడా! ఇప్పుడు ఈ లిస్టులో మరో హీరోయిన్‌ చేరారు. ఆమెనే డింపుల్‌ హయాతి. కొన్ని రోజుల ముందు ఈమె ఓ రెండు రోజుల పాటు వార్తల్లో నిలించారు. అందుకు కారణం ఓ పోలీసు అధికారితో గొడవ పెట్టుకోవడమే! జూబ్లీహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న డింపుల్‌ హయాతి ఆ అపార్ట్‌మెంట్‌లోకి కొత్తగా వచ్చిన ఓ పోలీస్‌ అధికారితో వాగ్వాదానికి దిగారు. పార్కింగ్‌ కోసం గొడవ పెట్టుకున్నారు. దాంతో ఆ పోలీసు అధికారి డింపుల్‌పై కేసు పెట్టారు. ఆ కేసు నుంచి బయటపడటానికే డింపుల్‌ ఈ ప్రత్యేక పూజలు చేసినట్లు తెలుస్తోంది. డింపుల్‌ హయాతి ఉంటున్న ఇంట్లోనే పూజ, యాగం వంటివి చేయించారు వేణుస్వామి. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింద. ఖిలాడి, రామబాణం సినిమాలలో డింపుల్‌ హయాతి హీరోయిన్‌గా నటించారు. ప్రస్తుతం కమలహాసన్‌ హీరోగా శంకర్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఇండియన్‌-2లో నటిస్తున్నారు డింపుల్‌ హయాతి

Updated On 28 Jun 2023 6:36 AM GMT
Ehatv

Ehatv

Next Story