ఒక్కోసారి సెలబ్రిటీలకు సడెన్ గా కోపం వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం అంటారో ఊహించడం కష్టం.అయితే సెలబ్రిటీల కోపంలో కూడా ఒక్కోసారి న్యాయం ఉంటుంది. వారిని విసిగిస్తేనో.. కోపం తెప్పించే ప్రశ్నలు వేస్తేనో.. తారలకు కోపం వస్తుంది. ఈక్రమంలో హీరోయిన్ డింపుల్(Dimple Hayathi) కు కూడా కోపం వచ్చింది. ఓ మీడియా ప్రతినిథిపై ఫైర్ అయ్యింది. అతను అడిగిన ప్రశ్నకు చిర్రెత్తుకోచ్చింది చిన్నదానికి ఇంతకీడింపుల్ ఏమన్నదంటే.. ?

కుర్రకారుకు వెర్రెక్కించే అందం డింపుల్ హయతీది. అందచందాల విషయంలో ఏమాత్రం తగ్గదు బ్యూటీ. యూత్ ను అట్రాక్ట్ చేసే అందంతో.. ఆమె ఆడియన్స్ ను తన వౌపు తిప్పుకుంటుంది. ఇక వరుసగా సినిమా అవకాశాలు కూడా సాదిస్తోంది. ఈమధ్య మాస్ మహారాజ్ రవితేుజ్ తో ఖిలాడిలో మెరిసిన బ్యూటీ.. గ్లామర్ ట్రీట్ ఇచ్చి.. రవితేజ అభిమానులకు కూడా మత్తెక్కించింది. ఇక ప్రస్తుతం యాక్షన్ స్టార్ గోపీచంద్ సరసన రామబాణం సినిమాలో నటిస్తోంది డింపుల్. ఈ మూవీ మే 5వ తేదీన విడుదల కాబోతోంది. రిలీజ్​కు సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్​లో వేగం పెంచారు రామబాణం టీమ్. ఈక్రమంలో అందాల భామ డింపుల్ కూడా ప్రమోషన్స్ లో పాల్లోటోంది.

అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్లు జోరుగా చేస్తున్న టీమ్.. తాజాగా ఓ ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ మీట్ లో రామబాణం మూవీ విషయాలు పంచుకున్నారు. అందులో భాగంగా.. ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆమెకు కోపం కట్టలు తెంచుకుంది. ఈమధ్య దర్శకులు చాలా మంది హీరోయిన్ల క్యారెక్టర్లను డిఫరెంట్​గా క్రియేట్ చేస్తున్నారు. కొత్త జానర్లో చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఈ మూవీలో మీ క్యారెక్టర్​ కొంచెం వల్గర్​గా, రొమాంటిక్​గా ఉన్నట్లు అనిపిస్తోంది అన్నాడు. దాంతో వల్గర్ అన్న పదం వినిగానే ఆమెకు కోపం ఆగలేదు.

వెంటనే తన అసహనం వెల్లడించింది బ్యూటీ. వల్గర్ అంటారేంటని ఎదురు ప్రశ్నించారు. సినిమాలో ఎక్కడా అలాంటి సీన్స్ లేవని.. గ్లింప్స్ కూడా అలాంటివి వదల్లేదన్నారు. సినిమా పాటల్లో, పోస్టర్లలో తాను శుభ్రంగా ఉన్నానని.. వల్గర్ అంటుంటే తనకు ఏమీ అర్థం కావడం లేదని నవ్వుతూనే చురకలు అంటించారు డింపుల్ హయతీ. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Updated On 27 April 2023 2:26 AM GMT
Ehatv

Ehatv

Next Story