మహిళల పట్ల పురుషులు ఇంకా అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని టాలీవుడ్ భామ చాందిని చౌదరి(Chandini Chowdhary) వాపోయింది. నేటి ఆధునిక కాలంలో ఉన్నా కానీ మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆవేదన చెందింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో(Social media) తమ పట్ల వచ్చే కామెంట్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కాలంలో సోషల్ మీడియాలో వచ్చే నెగెటివిటీ ట్రోలింగ్ గురించి సెలబ్రిటీలు స్పందిస్తున్నారు.
మహిళల పట్ల పురుషులు ఇంకా అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని టాలీవుడ్ భామ చాందిని చౌదరి(Chandini Chowdhary) వాపోయింది. నేటి ఆధునిక కాలంలో ఉన్నా కానీ మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆవేదన చెందింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో(Social media) తమ పట్ల వచ్చే కామెంట్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కాలంలో సోషల్ మీడియాలో వచ్చే నెగెటివిటీ ట్రోలింగ్ గురించి సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. నెగెటివిటీ ట్రోలింగ్‌పై(Negative Trolling) తమదైన శైలిలో తిప్పికొడుతున్నారు. తాజాగా సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి తన సోషల్ మీడియాలోనే స్పందించింది చాందిని చౌదరి.
ఎవరైనా అమ్మాయిలు నిరభ్యంతరంగా తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వెల్లడిస్తే వారిని అనరాని మాటలంటున్నారని వాపోయింది. వారిని లం*లేదా(Abusive Words) ఇంకా ఇతరత్రా అర్థాలు వచ్చేలా మాట్లాడుతున్నారని రాసుకుంది. 2024లో కూడా ఇలాంటి కామెంట్స్‌తో మహిళలను కించపరుస్తున్నారం చాలా బాధగా ఉందని, అంతేకాకుండా భయం కూడా వేస్తోందని తెలిపింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరెవరో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి వారికి నచ్చని మహిళల పట్ల విచ్చలవిడిగా కామెంట్స్ చేస్తున్నారని.. వారినే కాకుండా వారి తల్లులను, ఇంట్లో వారిని తిడుతూ బెదిరిస్తున్నారంది. మనం ఇలాంటి వాళ్ల చుట్టూ బతుకుతున్నామా అని ప్రశ్నించింది. బహిరంగంగానే నెగెటివ్ ట్రోలింగ్ చేసే ఇలాంటి మృగాలు ఇంట్లో ఉన్న ఆడవారి పట్ల ఎలా ప్రవర్తిస్తారోనని ఆందోళన వ్యక్తం చేసింది.
ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పిందనే అనుమానం కలగొచ్చు.. ఈ మధ్యకాలంలో ఐపీఎల్(IPL) టీమ్స్‌పై తాను చేసిన వ్యాఖ్యలే కారణమని భావిస్తున్నారు. తాను ఏపీకి చెందిన వ్యక్తినని ఏపీకి టీం లేనందున ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని ఆమె అన్నారు. హైదరాబాద్‌లో ఉంటున్నా తాను సన్ రైజర్స్ హైదరాబాద్‌కు మద్దతు ఇవ్వడం లేదన్నట్లు ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దీంతో కొందరు ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ ఆమె వ్యాఖ్యల పట్ల నెగెటివ్ ట్రోలింగ్ చేశారు. దీంతో చాందిని చౌదరి మనస్తాపం చెందినట్లు.. తనను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరించే ప్రయత్నం చేసినా నెగెటివ్ ట్రోలింగ్ ఆగకపోవడంతో ఆమె ఈ పోస్ట్ చేసినట్లు భావిస్తున్నారు నెటిజన్లు.
Social media has made faceless nameless people extremely comfortable with sick mouths and even sicker minds. Abusing our mothers? Death threats? Really?
I feel for the women who have to live with or around such people. God knows how they behave behind closed doors. Sickening!— Chandini Chowdary (@iChandiniC) May 21, 2024