బాలీవుడ్(Bollywood) పై సంచలన వ్యాఖ్యలు చేశారు..సీనియర్ హీరోయిన్ భూమిక(Bhumika). తనకు రావల్సిన అవకాశాన్ని రాకుండా చేసి అవమానించారని ఆవేదన చెందారు భూమిక. ఫిల్మ్ ఇండస్టరీ(Film Industry) అంటేనే పెద్ద మాయా ప్రపంచం. అది చూడటానికి రంగుల రంగులుగా కనిపిస్తుంది కాని.. అందులో పెద్ద మాయ ఉంటుంది. దానికి దొరికితే.. ఇక కెరీర్ అంతేసంగతులు. ఇలా తెలసుకోకనే చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులుపడ్డారు.

బాలీవుడ్(Bollywood) పై సంచలన వ్యాఖ్యలు చేశారు..సీనియర్ హీరోయిన్ భూమిక(Bhumika). తనకు రావల్సిన అవకాశాన్ని రాకుండా చేసి అవమానించారని ఆవేదన చెందారు భూమిక.

ఫిల్మ్ ఇండస్టరీ(Film Industry) అంటేనే పెద్ద మాయా ప్రపంచం. అది చూడటానికి రంగుల రంగులుగా కనిపిస్తుంది కాని.. అందులో పెద్ద మాయ ఉంటుంది. దానికి దొరికితే.. ఇక కెరీర్ అంతేసంగతులు. ఇలా తెలసుకోకనే చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులుపడ్డారు. పడుతూనే ఉన్నారు. . కొందరికి క్యాస్టింగ్ కౌచ్ రూపంలో వేధింపులు ఎదురవుతుంటాయి. మరి కొందరికి అవకాశాల పరంగా, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇలానే తాను కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటున్నారు సీనియర్ హీరోయిన్ భూమిక.

సీనియర్ హీరోయిన్.. భూమికా చావ్లా కూడా తాను బాలీవుడ్ లో మోసపోయినట్టు షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన బ్యూటీ.. ఈ విషయాన్ని వెల్లడించింది. తాను హిందీలో చేసిన మొదటి చిత్రం తేరే నామ్ అని చెప్పిన భూమికా.. ఆసినిమాతో తనకు వరుసగా అవకాశాలు వచ్చాయి అన్నారు. తేరేనామ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో తనకు అవకాశాలు వెల్లువ చిత్రంతో తాను హిందీలో తొలి చిత్రం చేశానని... ఆ సినిమా విజయం సాధించడంతో తనకు మంచి అవకాశాలు రావడం మొదలయ్యాయని చెప్పింది.

'తేరే నామ్' తర్వాత తనకు ఒక పెద్ద ఆఫర్ వచ్చిందని... అయితే నిర్మాతలు మారిపోవడంతో హీరోతో పాటు తనను కూడా ఆ సినిమా నుంచి తీసేశారని భూమిక తెలిపింది. ఆ సినిమా టైటిల్ ను కూడా మార్చేశారని చెప్పింది. ఆ సినిమాను చేసి ఉంటే ఇప్పుడు తన పరిస్థితి మరోలా ఉండేదని బాధపడింది సీనియర్ బ్యూటీ. ఆ సినిమా గురించి తాను ఏదేదో ఊహించుకున్నానని... మరో సినిమాను ఒప్పుకోకుండా ఏడాది పాటు ఆసినిమా గురించే వెయిట్ చేశానన్నారు. అలా తన జీవితంలో పెద్ద దెబ్బ ఆసినిమాతో తగిలిందన్నారు.

అంతేకాదు 'జబ్ వీ మెట్' సినిమాకు కూడా తొలుత తానే సంతకం చేశానని... తనకు జోడీగా బాబీ డియోల్ ను తీసుకున్నారని... అయితే ఆతరువాత బాబీ డియోల్ ను తీసేసి షాహిద్ కపూర్ ను తీసుకున్నారని... వెంటనే తనను కూడా తీసేశారని వాపోయింది భూమిక. ఇక చివరకు ఆ సినిమాలో షాహిద్ కపూర్, కరీనా కపూర్ నటించారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం భూమికా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Updated On 27 April 2023 1:34 AM GMT
Ehatv

Ehatv

Next Story