టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంతో పేరు చెచ్చకుంది ఆసిన్(Asin). వరుస సినిమాలు.. వరుస సక్సెస్ లతో దూసుకుపోయిన ఆసిన్.. తమిళ పరిశ్రమలో.. కూడా మంచి సక్సెస్ లు అందుకున్నారు.అంతే కాదు.. బాలీవుడ్ లో కూడా వరుససినిమాలు చేసి.. కెరీర్ మంచి ఫామ్ లో ఉండగా.. మైక్రో మాక్స్ సీఈవో రాహుల్ శర్మను 2016 లో పెళ్లాడింది ఆసిన్. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఓ పాపకూడా జన్మించగా.. హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది బ్యూటీ.
ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్ విడాకుల వార్తలు ఎక్కువైపోయాయి. తాజాగా సీనియర్ హీరోయిన్ ఆసిన్ విడాకుల వార్తలు వైరల్ అవుతుండగా.. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది ఆసిన్.
టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంతో పేరు చెచ్చకుంది ఆసిన్(Asin). వరుస సినిమాలు.. వరుస సక్సెస్ లతో దూసుకుపోయిన ఆసిన్.. తమిళ పరిశ్రమలో.. కూడా మంచి సక్సెస్ లు అందుకున్నారు.అంతే కాదు.. బాలీవుడ్ లో కూడా వరుససినిమాలు చేసి.. కెరీర్ మంచి ఫామ్ లో ఉండగా.. మైక్రో మాక్స్ సీఈవో రాహుల్ శర్మను 2016 లో పెళ్లాడింది ఆసిన్. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఓ పాపకూడా జన్మించగా.. హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది బ్యూటీ.
అయితే తాజాగా ఆసిన్ విడాకులు(Divorce) తీసుకోబోతునట్టు వార్తలు వైరల్ అయ్యాయి. రాహుల్ శర్మ వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకకున్నాడని.. దాంతో ఆడపిల్లను తీసుకుని ఆమె విడిగా ఉంటుంది అంటూ వార్తలు వస్తున్నాయి. దాంతో ఈ విషయంలో ఆసిన్ తాజాగా స్పందించింది. తమ విడాకుల వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చింది. దీనిపై తాజాగా ఆసిన్ స్పందిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ స్టోరీ పోస్ట్ చేసింది.
ఆసిన్ తన స్టోరీలో.. ప్రస్తుతం మేము మా వేసవి సెలవులకి(Summer vacattion) ఎంజాయ్ చేస్తున్నాము. ఇద్దరం ఒకరికి ఎదురుగా ఒకరు కూర్చొని టిఫిన్ చేస్తూ ఈ వార్తలు చూశాం. ఇవి పూర్తిగా అవాస్తవం, నిరాధార వార్తలు. గతంలో కూడా పెళ్లి సమయంలో మేము బ్రేకప్ చెప్పుకున్నామని వార్తలు రాశారు. ఇలాంటి వార్తలు చూసి 5 నిమిషాల సమయాన్ని వేస్ట్ అయినందుకు నిరాశ చెందుతున్నాను. దయచేసి మంచి వార్తలు రాయండి అని గట్టిగా కౌంటర్ ఇచ్చింది. దీంతో ఆసిన్ తమ విడాకుల వార్తలకు అబద్ధం అని క్లారిటీ ఇచ్చేసింది.