టాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసి... బాలీవుడ్ లో కూడా స్టార్ గా వెలిగిన సీనియర్ హీరోయిన్ ఆసిన్(Asin) గుర్తుండే ఉంటుంది. ఆమె తెలుగులో అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి(Amma Nanna O Tamil ammai) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఆసిన్. . ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుస అవకాశాలు సాధించింది సీనియర్ బ్యూటీ. వెంటనే శివమణి(Shivamani), లక్ష్మీ నరసింహ(Lakshmi Nara Simha), ఘర్షణ(Garshana), సినిమాలతో హిట్ల మీద హిట్లు కొట్టింది బ్యూటీ.
ఈ మధ్య ఇండస్ట్రీలో విడాకుల(Divorce) కేసులు ఎక్కువైపోయాయి. పెళ్లిళ్లు(Marriages) జరుగుతూనే ఉన్నాయి.. వాటితో పాటు డివోర్స్ కేసులు కూడా పెరుగుతున్నాయి. తాజాగా మరో స్టార్ హీరోయిన్ డివోర్స్ కు రెడీ అయ్యిదట.
సినిమా వాళ్లలో చాలా మంది.. పెళ్లి చేసుకున్నంత ఈజీగా విడాకులు తీసుకుంటున్నారు. మరికొంత మంది మాత్రం ఎన్నో ఏళ్ల జీవితాన్ని చూసిన తరువాత డివోర్స్ వైపు అడుగులు వేస్తున్నారు. స్టార్ హీరో ధనుష్(Dhanush) దంపతులు 18 ఏళ్ళ సంసారం తరువాత విడాకులు తీసుకున్నారు. నాగచైతన్య(Nagachaithanya) , సమంత(Samantha) పెళ్లైన మూడేళ్ళకే విడాకులు తీసుకుంటే.. ఆమధ్య ఓ తమిళ బుల్లితెర జంట మాత్రం పెళ్లైన మూడునెలలకే విడిగా ఉంటూ.. విడాకులకు అప్లై చేసుకున్నారు. ఇక తాజాగా మరో స్టార్ హీరోయిన్ అదే రూట్లో వెళ్తున్నట్టు తెలుస్తోంది.
టాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసి... బాలీవుడ్ లో కూడా స్టార్ గా వెలిగిన సీనియర్ హీరోయిన్ ఆసిన్(Asin) గుర్తుండే ఉంటుంది. ఆమె తెలుగులో అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి(Amma Nanna O Tamil ammai) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఆసిన్. . ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుస అవకాశాలు సాధించింది సీనియర్ బ్యూటీ. వెంటనే శివమణి(Shivamani), లక్ష్మీ నరసింహ(Lakshmi Nara Simha), ఘర్షణ(Garshana), సినిమాలతో హిట్ల మీద హిట్లు కొట్టింది బ్యూటీ. ఎన్ని సూపర్ హిట్లు సాధించిందో.. అంతే ప్లాప్ సినిమాలు కూడా చూసింది. ఆసిన్ కెరీర్ లో అన్నవరం(Annavram), చక్రం(Chakram) వంటి పెద్ద సినిమాలు ప్లాప్ అయ్యాయి.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న టైమ్ లో అటు తమిళ్ లో కూడా గజినీ(Gajini) లాంటి హిట్లు సాధిచింది. వెంటనే బాలీవుడ్ చేరిన ఆసిన్ అక్కడ కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. కెరీర్ మంచి పీక్స్ లోఉండగానే బిజినెస్ మెన్.. మైక్రో మాక్స్సీఈవో(Micro Max CEO) రాహుల్ శర్మను(Rahul Sharma) 2016 లో పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది ఆసిన్.
ఆసిన్, రాహుల్ పెళ్లి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దగ్గరుండి చేశారు. ఇక చాలా కాలం హ్యాపీగా లైఫ్ లీడ్ చేసిన ఈజంటకు ఓ పాప కూడా ఉంది. ఇక కొద్ది కాలంగా వారి మధ్య మనస్పర్థలు తలెత్తినట్టు తెలుస్తోంది. త్వరలో ఈ జంట విడాకులు తీసుకోబోతుందంటూ ఇప్పుడు గాసిప్స్ మొదలయ్యాయి.రాహుల్ శర్మ కొన్నాళ్లుగా వేరే అమ్మాయితో ఎఫైర్ నడుపుతున్నాడట. ఈ విషయం తెలుసుకున్న ఆసిన్.. ఒకటి రెండు సార్లు హెచ్చరించిందట. అయినా అతను వినకుండా తనకు నచ్చినట్టు చేస్తుండటంతో.. ఈమె అతని నుండి సెపరేట్ అయ్యి దూరంగా ఉంటుంనట్టుగా తెలుస్తోంది. తనకు పాప ఉన్నాసరే…ఆసిన్ విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.