అనుష్క షెట్టి(Anushka Shetty) గురించి కొత్తగా చెప్పడానికి ఏముంటుంది. ఆమె తిరుగులేని హీరోయిన్! అరుంధతి సినిమాతో ఆమె అగ్రశ్రేణి హీరోయిన్ అయ్యారు. లేడి ఓరియంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. అరుంధతిలో(Arundhati) ఆమె పోషించిన జేజెమ్మ పాత్రను ఎవరైనా మర్చిపోగలరా? ఆ సినిమా ఆమె కెరీర్‌ను కొత్త పుంతలు తొక్కించింది. ఆ తర్వాత బాహుబలి సినిమాతో ఆమె ఖ్యాతి ఎల్లలు దాటింది. బాహుబలి రెండు భాగాలు ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. నార్త్ ఇండియాలో కూడా ఆమెకు అభిమానులు ఏర్పడ్డారు.
అనుష్క షెట్టి(Anushka Shetty) గురించి కొత్తగా చెప్పడానికి ఏముంటుంది. ఆమె తిరుగులేని హీరోయిన్! అరుంధతి సినిమాతో ఆమె అగ్రశ్రేణి హీరోయిన్ అయ్యారు. లేడి ఓరియంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. అరుంధతిలో(Arundhati) ఆమె పోషించిన జేజెమ్మ పాత్రను ఎవరైనా మర్చిపోగలరా? ఆ సినిమా ఆమె కెరీర్‌ను కొత్త పుంతలు తొక్కించింది. ఆ తర్వాత బాహుబలి సినిమాతో ఆమె ఖ్యాతి ఎల్లలు దాటింది. బాహుబలి రెండు భాగాలు ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. నార్త్ ఇండియాలో కూడా ఆమెకు అభిమానులు ఏర్పడ్డారు. మధ్యలో సైజ్ జీరో (Size Zero) సినిమాలో అనవసరమైన ప్రయోగాలకు వెళ్లారు అనుష్క. ఆ సినిమా కోసం బొద్దుగా మారిన అనుష్క పూర్వాకృతి కోసం చాలా కష్టపడ్డారు. చాన్నాళ్ల తర్వాత నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mister Pollishetty) సినిమాలో నటించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇదిలా ఉంటే అనుష్క షెట్టికి మరో ఆసక్తికరమైన ప్రాజెక్టు లభించింది. మలయాళంలో రూపొందుతున్న ఫాంటసీ హారర్ డ్రామా కథనార్- ది వైల్డ్ సోర్సెరర్(The Wild Sorcerer) సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను(First Glimpse) లేటెస్ట్‌గా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో జాతీయ అవార్డు అందుకున్న మలయాళ హీరో జయసూర్య(Jayasurya) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. జయసూర్య పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో అనుష్క షెట్టి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నాడు. అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మే కేరళ పూజారి కడమత్తత్తు కథనార్ కథల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. మొత్తం 14 భాషలలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది మొదటి భాగం విడుదల అవుతుంది. సుమారు రెండు నిమిషాల పాటు ఉన్న ఈ గ్లింప్స్ అద్భుతమైన విజువల్స్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది.