ఒకప్పుడు టాలీవుడ్‌లో అగ్రతారగా వెలుగొందిన అనుష్క(Anushka) మూడేళ్లుగా సినిమాల్లో కనిపించడం లేదు. 2019లో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన సైరా(Syra) సినిమాలో తళుక్కుమని మెరిసిన అనుష్క తర్వాతి ఏడాది నిశ్శబ్దం(Nishabdham) అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఓటీటీలో నేరుగా విడుదలయ్యింది. ఈ లెక్కన అనుష్క వెండితెరపై కనిపించి మూడేళ్లవుతుందన్న మాట. చాలా కాలం తర్వాత ఆమె యూవీ క్రియేషన్స్‌(UV Creations) పతాకంలో మిస్‌శెట్టి, మిస్టర్‌ పొలిశెట్టి(Miss Shetty Mr Polishetty) అనే సినిమాలో నటిస్తున్నారు. యంగ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టి(Naveen Polishetty) ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. సెప్టెంబర్‌ 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది.

ఒకప్పుడు టాలీవుడ్‌లో అగ్రతారగా వెలుగొందిన అనుష్క(Anushka) మూడేళ్లుగా సినిమాల్లో కనిపించడం లేదు. 2019లో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన సైరా(Syra) సినిమాలో తళుక్కుమని మెరిసిన అనుష్క తర్వాతి ఏడాది నిశ్శబ్దం(Nishabdham) అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఓటీటీలో నేరుగా విడుదలయ్యింది. ఈ లెక్కన అనుష్క వెండితెరపై కనిపించి మూడేళ్లవుతుందన్న మాట. చాలా కాలం తర్వాత ఆమె యూవీ క్రియేషన్స్‌(UV Creations) పతాకంలో మిస్‌శెట్టి, మిస్టర్‌ పొలిశెట్టి(Miss Shetty Mr Polishetty) అనే సినిమాలో నటిస్తున్నారు. యంగ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టి(Naveen Polishetty) ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. సెప్టెంబర్‌ 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. అప్పట్లో అనుష్క రెమ్యునిషనే అందరికంటే ఎక్కువ! సినిమాకు మూడు కోట్ల రూపాయల వరకు పారితోషికం(remuneration) తీసుకున్నారు. అయితే అది అప్పటి సంగతి. ఇప్పుడు తన రెమ్యునరేషన్‌ డబుల్‌ చేశారట! మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి చిత్రానికి ఆమె ఆరు కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ తీసుకున్నారట! ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు. కాకపోతే సోషల్‌ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్‌ అవుతోంది. ఎంత సంపాదించమన్నది కాదు ముఖ్యం. సినీ పరిశ్రమలో ఎంత మంది స్నేహితులను సంపాదించుకున్నామన్నదే ప్రధానం అనే మాటను నమ్మే అనుష్క రెమ్యునరేషన్‌ కోసం బలవంతపెట్టే రకం కాదు. గతంలో ఈ రెమ్యునరేషన్లపై అనుష్క తన అభిప్రాయాన్ని చెప్పారు. 'ఒక నటి వంద చిత్రాల్లో నటించడం, కోట్లకు కోట్లు సంపాదించడం, చాలా ఏళ్లు కథానాయకిగా పరిశ్రమలో నిలదొక్కుకోవడం లాంటివి పెద్ద విషయాలు కావు. కానీ ఎంతమంది స్నేహితులను సంపాదించుకున్నామన్నదే ముఖ్యం. డబ్బు ఆర్జించడం కంటే మంచి మనుషుల్ని సంపాదించడం గొప్ప విషయం. నాకు పారితోషికం ప్రధానం కాదు. మంచి కథా పాత్రలో నటించాలన్నదే నా కోరిక' అని అనుష్క పేర్కొన్నారు.

Updated On 21 Aug 2023 7:01 AM GMT
Ehatv

Ehatv

Next Story