మహిళలను వక్రదృష్టితో చూసే మగానుభావులు ప్రతి చోటా ఉంటారు. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి సినీ ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్లు ఎక్కువగా ఉంటారు. కాస్టింగ్ కౌచ్(casting couch)కు గురైన వారు చాలా మంది ఉన్నారక్కడ. కొందరు బయటకు చెప్పుకోలేరు. కొందరు మాత్రం ధైర్యంగా తమకు ఎదురైన అనుభవాలను చెబుతుంటారు.
మహిళలను వక్రదృష్టితో చూసే మగానుభావులు ప్రతి చోటా ఉంటారు. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి సినీ ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్లు ఎక్కువగా ఉంటారు. కాస్టింగ్ కౌచ్(casting couch)కు గురైన వారు చాలా మంది ఉన్నారక్కడ. కొందరు బయటకు చెప్పుకోలేరు. కొందరు మాత్రం ధైర్యంగా తమకు ఎదురైన అనుభవాలను చెబుతుంటారు. నటి అను ఇమ్మానుయేల్(Anu Emmanuel)కు కూడా కాస్టింగ్ కౌచ్‌కు గురైరయ్యారట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తెలిపారు. స్కూల్ స్టూడెంట్‌గా ఉన్న సమయంలోనే బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఈ మలయాళీ బ్యూటీ తర్వాత 2016లో నిఫిన్ బాలికి జంటగా యాక్షన్ హీరో బిజూ(Action Hero Biju) అనే సినిమాలో నటించి కథనాయికగా తొలి అడుగు వేశారు. అదే సంవత్సరం నాని హీరోగా నటించిన మజ్ను(Majnu) సినిమాలో కిరణ్మై పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నారు. అటు పిమ్మట తమిళ హీరో శివకార్తికేయన్‌కు జంటగా నమ్మవీటు పిళ్లై(Namma Veettu Pillai) సినిమాలో నటించారు. ఈ సినిమాపై అను ఇమ్మానుయేల్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రం తర్వాత చాలా అవకాశాలు వస్తాయని అనుకున్నారు. సినిమా విజయవంతమైనప్పటికీ అను ఇమ్మానుయేల్‌ను మాత్రం తమిళ ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో తెలుగు సినీ పరిశ్రమపై దృష్టి పెట్టారు. ఇక్కడ స్టార్ హీరోలతో నటించే అవకాశాలు ఆమెకు వచ్చాయి. అలా అజ్ఞాతవాసి, నా పేరు సూర్య, గీత గోవిందం వంటి సినిమాలలో నటించారు. అయినప్పటికీ ఆమెకు మాత్రం స్టార్ ఇమేజ్ రాలేదు. లేటెస్ట్‌గా కార్తీ హీరోగా వచ్చిన జపాన్(Japan) చిత్రంలో నటించారు. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై అను ఇమ్మానుయేల్ చాలా ఆశలు పెట్టుకున్నారు. కాగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్‌పై పెదవి విప్పారు. తనకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని తెలిపారు. అయితే ఇలాంటి సంఘటనలను కుటుంబ సభ్యుల సహాకారంతో ధైర్యంగా ఎదుర్కొన్నానని అన్నారు. ఇలాంటి సందర్భాలలో సమస్యను ఒంటరిగా కాకుండా కుటుంబసభ్యుల అండతో ఎదుర్కోవడం మంచిదని ఆమె సూచించారు.