సైబర్(Cyber) కేటుగాళ్ల చేతిలో మోసపోతున్నవారు రోజురోజుకు పెరిగిపోతున్నారు. లేటెస్ట్‌గా ఓ ప్రముఖ నటి(Actress) వారి బారిన పడింది. నిమిషాల్లో లక్షల రూపాయలు పొగొట్టుకుంది. తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అంజలి పాటిల్(Anjali Patil). తెలుగులో నా బంగారుతల్లి(Na Bangaru Thalli) అనే సినిమాలో లీడ్ రోల్‌ను పోషించింది. ఆ సినిమాగాను ఆమెకు నంది అవార్డు(Nandi Award) కూడా వచ్చింది.
సైబర్(Cyber) కేటుగాళ్ల చేతిలో మోసపోతున్నవారు రోజురోజుకు పెరిగిపోతున్నారు. లేటెస్ట్‌గా ఓ ప్రముఖ నటి(Actress) వారి బారిన పడింది. నిమిషాల్లో లక్షల రూపాయలు పొగొట్టుకుంది. తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అంజలి పాటిల్(Anjali Patil). తెలుగులో నా బంగారుతల్లి(Na Bangaru Thalli) అనే సినిమాలో లీడ్ రోల్‌ను పోషించింది. ఆ సినిమాగాను ఆమెకు నంది అవార్డు(Nandi Award) కూడా వచ్చింది. ఆ తర్వాత తెలుగులో మళ్లీ సినిమాలు చేయలేదు కానీ, ప్రస్తుతం హిందీ, మరాఠీ సినిమాల్లో బిజీగా ఉంది. తాజాగా ఆమెకు డిసెంబర్ 28వ తేదీన దీపక్‌శర్మ(Deepak sharma) అనే వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ఫెడ్ ఎక్స్(FedEx) ఉద్యోగి అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఈమె పేరుతో ఉన్న ఓ పార్సిల్ డ్రగ్స్‌తో తైవాన్‌లో పట్టుబడిందని చెప్పాడు. పార్సిల్‌లో ఆధార్ కార్డు కాపీ కూడా ఉందని తెలిపాడు. తన ఆధార్ కార్డు ఎక్కడ దుర్వినియోగం అవుతుందేమోనన్న కంగారు పడిన అంజలి పాటిల్ తాను ముంబాయి సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదిస్తానని ఆ వ్యక్తికి చెప్పింది. ఇది జరిగిన కాసేపటికే అంజలికి సైబర్ బ్రాంచ్ నుంచి ఫోన్ చేస్తున్నానంటూ బెనర్జీ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. మీ ఆధార్‌కార్డు(Aadhaar), మూడు బ్యాంక్ అకౌంట్లకు కనెక్ట్ అయ్యాయని, అవి మనీలాండరింగ్ కేసుల్లో చిక్కుకుని ఉన్నాయని భయపెట్టాడు. ప్రాసెసింగ్ ఫీజ్ కోసం 96,525 రూపాయలు పంపాలని అంజలికి చెప్పాడు. ఆమె వెంటనే ఆ అమౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేసింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ కోసం 4,83,291 రూపాయలు పంపాలని తెలిపాడు. పాపం ఆ అమౌంట్‌ను కూడా అంజలి పంపేసింది. డబ్బులు పంపిన కాసేటికి తాను మోసపోయానని గ్రహించింది. నిమిషాల వ్యవధిలోనే 5.79 లక్షల రూపాయలను పోగొట్టుకుంది అంజలి పాటిల్. దీంతో వెంటనే ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. వారు ఐపీసీ 419, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.