ఈమధ్య సెలబ్రిటీల పెళ్ళి రూమర్లు(Marriage rumours) ఎక్కువైపోయాయి. నిజమోకాదో తెలియదు కాని.. ఫలానా హీరో.. ఫలానా హీరోయిన్ పెళ్ళంటూ.. వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈహీరోయిన్ అంజలి పెళ్ళిపై కూడా ఇలాంటి వార్తలు రాగా ఆమె క్లారిటీ ఇచ్చింది.

ఈమధ్య సెలబ్రిటీల పెళ్ళి రూమర్లు(Marriage rumours) ఎక్కువైపోయాయి. నిజమోకాదో తెలియదు కాని.. ఫలానా హీరో.. ఫలానా హీరోయిన్ పెళ్ళంటూ.. వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈహీరోయిన్ అంజలి పెళ్ళిపై కూడా ఇలాంటి వార్తలు రాగా ఆమె క్లారిటీ ఇచ్చింది.

తెలుగులో వరుస సినిమాలు చేసిన అంజలి(Anjali).. ఇక్కడ ఆదరణ లేక.. తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తమిళంలో షాపింగ్ మాల్(shopping mall).. సినిమాతో ఆమె సంచలనంగా మారింది. ఈసినిమా తరువాత వచ్చిన జర్నీ సినిమా అంజలికి తిరుగు లేని ఇమేజ్ గా మారింది. వరుసగా తమిళంలో అవకావాలు రావడం.. స్టార్ గా మారిన అంజలి. తనను పట్టించుకోకుండా వదిలేసిన తెలుగు పరిశ్రమలో కూడా ఎంటర్ అయ్యి.. తన సత్తా చాటింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో టాలీవుడ్ లోవిజయ ప్రస్తానం మొదలెట్టింది బ్యూటీ.

జర్ని(Journey) సినిమా తరువాత నటుడు జై(Jay), అంజలి ఒకానొక సమయంలో ప్రేమించుకున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఒక్కసారిగా మనస్పర్థలు రావడంతో నటుడు జైతో అంజలి విడిపోయింది. ఒక దశలో అంజలి బరువు పెరగడంతో సినిమా నుంచి తప్పుకుంది. ఆ తర్వాత కసరత్తు చేసి మళ్లీ స్లిమ్ అయి గ్లామర్ హీరోయిన్ గా కూడా మారిపోయింది అంజలి.

అంతే కాదు అంజలి జీవితంలో ఎన్నో విషాదాలు కూడాజరిగాయి. అన్నింటిని ఎదురించి తట్టుకుని నిలబడింది బ్యూటీ. ఇక ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటూ.. తెలుగు తమిళంలో దూసుకుపోతోంది బ్యూటీ. అంజలి ప్రస్తుతం గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్(Game Changer) సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు అందుకుంటున్న అంజలి.. పెళ్ళిపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. పెళ్లి పుకార్లపై తెలుగు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో విధంగా చెప్పింది. నాకు సినీరంగంలో చాలా మంది స్నేహితులున్నారు. నా గురించి ఏం రాయాలో, ఎవరితో రాయాలో వారే నిర్ణయిస్తారు.

మొదట నటుడు జైతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడిందని చెబుతున్నారు. నాకు తెలియకుండానే నాకు పెళ్లయిపోయిందని రాశారు.. అవి విని ఏం మాట నవ్వేశాను. అవన్నీ విని.. నటిగా ఉన్నందకు మొదటి సారి బాధపడ్డాను అన్నారు అంజలి. ఇక అంజలి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Updated On 8 Jan 2024 8:54 AM GMT
Ehatv

Ehatv

Next Story